శబరిమల ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది కేరళ ప్రభుత్వం. శబరిమల ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిప్పారు. ఎరుమేలిలోఈ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం నిర్మితం కానున్న ఎయిర్ పోర్టుకు రంగం సిద్ధమైంది.

New Update
శబరిమల ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్

Green signal to Sabarimala airport

సులభంగా అయ్యప్ప జర్నీ

ప్రతి యేటా లక్షలాది మంది భక్తులు మాలను ధరించి, నియమ, నిష్ఠలతో పూజలు చేస్తూ అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్తుంటారు. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో శబరిమలకు వెళ్లి వస్తుంటారు. ఎక్కువ గంటలు ప్రయాణం చేయలేనివారు, సమయం తక్కువ ఉన్నవారు విమానాల్లో వెళ్తుంటారు. శబరిమలకు విమానంలో వెళ్లాలంటే కొచ్చి లేదా తిరువనంతపురంకు వెళ్లాలి. కొచ్చిలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శబరిమలకు 160 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే తిరువనంతపురం నుంచి 170 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.ఇప్పుడు ఈ కష్టాలన్నీ తొలగిపోనున్నాయి.

పర్మిషన్ వచ్చింది

శబరిమల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్ర పర్యావరణశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 3,411 కోట్లతో ఎరుమేలిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2,570 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారని తెలిపారు. విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుందని అధికారులు తెలిపారు.

ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం

శబరిమల కేరళ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు ఈ క్షేత్రం వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ, మకరవిళక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచటం ఈ గుడి యొక్క ఆనవాయితీ.

Advertisment
Advertisment
తాజా కథనాలు