మోడీ అభిమాని అంటే ఆ మాత్రం ఉండాల్సిందే...జాకెట్ నుంచి కారు నెంబర్ ప్లేట్ వరకు..!! భారత ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికాలోనూ మోడీకి వీరాభిమానులున్నారు. జాబ్రా అనే వ్యక్తి ప్రధానిమోడీ చిత్రాలతో ఉన్న జాకెట్ ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు 2014లో తన కారు నెంబర్ ప్లేట్ పై పీఎం మోడీ అని రాయించుకున్నాడు. మోడీ అమెరికాకు చేరుకోగానే న్యూయార్క్ కు పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అందులో మినేష్ సి పటేల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మోడీ అభిమాని అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా..!! By Bhoomi 21 Jun 2023 in వైరల్ New Update షేర్ చేయండి సామాన్య పౌరుల నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు, క్రికెట్ ప్లేయర్స్ నుంచి విదేశాల వరకు మోడీ అభిమానులను చూసే ఉంటారు. అయితే అమెరికాలో కూడా ప్రధాని మోడీకి వీరాభిమానులున్నారు. ప్రధానిమోడీ మూడు రోజుల పర్యటనకోసం అమెరికాకు చేరుకోగానే న్యూయార్క్ కు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. అందులో మినేష్ సి పటేల్ అనే వ్యక్తి మోడీ బొమ్మలతో ఉన్న జాకెట్ ను ధరించి అందర్నీ ఆకర్షించారు. జాకెట్ మాత్రమే కాదు తన కారు నెంబర్ ప్లేట్ పై కూడా పీఎం మోడీ అంటూ రాయించుకున్నాడు. తాను ధరించిన జాకెట్ పై మోడీ చిత్రాలు ఉన్నాయంటే తాను మోడీని ఎంతగా అభిమానిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ప్రధాని మోడీ పట్ల తనకున్న గౌరవాన్ని, ఆప్యాయతను చాటుకున్నారు. 2014 నుంచి తన కారు నెంబర్ ప్లేటుపై పీఎం మోడీ అని రాయించుకుని తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేశాడు. తన దగ్గర మోడీ చిత్రాలతో స్పెషల్ గా తయారు చేయించుకున్న ఇలాంటి జాకెట్లు 26 ఉన్నాయని తెలిపాడు. jackets | New York: Minesh C Patel, a member of the Indian diaspora flaunts his jacket with PM Narendra Modi's image printed on it. "This jacket was made in 2015 during Gujarat Day... We have 26 of this (jackets) and out of these 26 (jackets) four of them are here today," says… pic.twitter.com/OL3NWhtONy— ANI (@ANI) June 20, 2023 ప్రధాని మోడీ కార్యక్రమం పూర్తి షెడ్యూల్ ఇది: జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని ప్రధాని మోడీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. సాయంత్రం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశం కానున్నారు. జూన్ 22న ప్రధాని మోడీ వాషింగ్టన్ డీసీలో అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించనున్నారు. అదే రోజు సాయంత్రం అంటే జూన్ 22 సాయంత్రం, మిస్టర్ అండ్ మిసెస్ బిడెన్ ప్రధాని మోడీ గౌరవార్థం ప్రత్యేక రాష్ట్ర విందు ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర అతిథిగా ప్రధాని మోడీ హజరుకానున్నారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ జూన్ 23 ఉదయం ప్రధాని మోడీ గౌరవార్థం లంచ్ ఏర్పాటు చేశారు. జూన్ 23 సాయంత్రం, కెన్నెడీ హౌస్‌లో పిఎం మోడీ కార్యక్రమం ఉంటుంది, ఆపై రోనాల్డ్ రీగన్ సెంటర్‌లో జూన్ 23 న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకోసం రీగన్ సెంటర్‌ను ప్రత్యేకంగా అలంకరించారు. దీని తర్వాత జూన్ 24న ప్రధాని మోడీ ఈజిప్ట్‌కు వెళ్లనున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి