ఇండియన్ ఆర్మీలో చేరిన సూపర్ స్టార్ కూతురు...!!
భోజ్ పురి సూపర్ స్టార్, బీజేపీ ఎంపి రవికిషన్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. రేసుగుర్రం మూవీతో మద్దాలి శివారెడ్డిగా విలన్ క్యారెక్టర్ లో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. హిందీలో ఫిర్ హేరా ఫేరీ, వెల్కమ్ టు సజ్జన్ పూర్, ముక్కాబాజ్, కిక్ 2 వంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రవికిషన్ గోరఖ్ పూర్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఇప్పుడాయన కూతురు ఇషితా శుక్లా ఇండియన్ ఆర్మీలో చేరడం పట్ల ఆయన అభిమానులతోపాటు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.