/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Iron-Pillar-Collapses-In-Middle-Of-Busy-Karnataka-Road.jpg)
అదొక ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే ఆ రోడ్డుపై సడెన్‌గా ఓ ఐరన్ రాడ్డు రోడ్డుపై పడింది. ఒక్క క్షణం అటూ ఇటుగా ఆలస్యం అయినా వాహనదారుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి. అడుగు దూరంలో కళ్లముందే పెద్ద ఐరన్ పిల్లర్ కూలడంతో ఆ బైకర్లు షాక్ కు గురయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లిలో మంగళవారం చోటు చేసుకుంది. దీంతో పెనుప్రమాదం తప్పిందిరా నాయనా.. హమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు.
రైల్వే అండర్ బ్రిడ్జి ముందు హెచ్చరికగా ఏర్పాటు చేసిన పిల్లర్
రైల్వే అండర్ బ్రిడ్జి ముందు ఈ పిల్లర్ ను గతంలో అధికారులు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది నుంచి వెళ్లే వాహనాలకు ఎత్తుకు సంబంధించిన వాహనాలను హెచ్చరిస్తూ ఏర్పాటు చేసిన పిల్లర్ ఇది. ఇటీవల పలు వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందని రైల్వే అధికారులు తెలిపారు. నిత్యం బిజీగా ఉండే రోడ్డు కావడంతో వాహనాల రాకపోకల సందర్భంగా ఏర్పడే వైబ్రేషన్ కు పిల్లర్ మరింత బలహీనంగా మారి సడెన్ గా కూలిపోయిందన్నారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వాహనాలు ఢీ కొట్టడంతో పిల్లర్ బలహీనంగా మారిందన్న అధికారులు
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే... వాహనాదారులు మాత్రం ఇది ఖచ్చితంగా రైల్వే అధికారుల నిర్లక్ష్యం అంటూ మండిపడుతున్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటే ఏమయ్యేదంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.