ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీస్ లో రేసుగుర్రం ఒకటి. ఇందులో అల్లు అర్జున్ కు ఎంత పేరు వచ్చిందో..విలన్ క్యారెక్టర్ కు కూడా అంతే పేరువచ్చింది. మద్దాలిశివారెడ్డిగా భోజ్ పురి సూపర్ స్టార్ రవికిషన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భోజ్ పురితోపాటు పలు హిందీ సినిమాల్లో నటించిన ఆయన రేసుగుర్రం మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టారు. కిక్ 2. సుప్రీం, రాధా, అబద్దం, ఎమ్మెల్యే, సాక్ష్యం వంటి ఎన్నో చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో సందడి చేశాడు.
రవికిషన్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. 2019లో బీజేపీ తరపును గోరఖ్ పూర్ నుంచి ఎంపిగా పోటీ చేసి గెలిచారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్రీతిశుక్లాను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు సంతానం. ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు.
मेरी बिटिया ईशिता शुक्ला ,आज सुबह बोली पापा I wanna b in #AgnipathRecruitmentScheme I said go ahead beta 🇮🇳 pic.twitter.com/BkxoOB81QQ
— Ravi Kishan (@ravikishann) June 15, 2022
రవికిషన్ ముగ్గురి కూతుర్లలో ఒకరైన ఇషితా శుక్ల ఇండియన్ ఆర్మీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక అగ్నిపథ్ పథకంలో ఇషితా జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని రవికిషోర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇషితా వయస్సు 21ఏళ్లు. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులోనే దేశ సరిహద్దులో దేశ సేవ కోసం ఆమె ఆర్మీలో చేరడం పట్ల అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కుమార్తెను ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యేందుకు ప్రోత్సహించిన రవికిషన్ ను నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.