రియల్​మీ నార్జో 60 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్ లీక్..స్టోరేజీ కెపాసిటీ అదుర్స్..!!

రియల్ మీ నార్జో 60 స్మార్ట్‎ఫోన్‎ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. భారత మార్కెట్లో ఇంకా విడుదల అవ్వకముందు ఈ ఫోన్ స్పెసిఫికేషన్ లీక్ అవ్వడం గమనార్హం. స్పెషల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయంటే...

New Update
రియల్​మీ నార్జో 60 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్ లీక్..స్టోరేజీ కెపాసిటీ అదుర్స్..!!

ప్రముఖ స్మార్ట్‎ఫోన్‎ బ్రాండ్ రియల్ మీ నార్జో 60 సిరీస్ లో కొత్త ఫోన్ను త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. అయితే రిలీజ్ కు ముందే.. తన ట్విట్టర్ హ్యాండిల్లో ద్వారా ఈ స్మార్ట్‎ఫోన్‎కు సంబంధించిన స్పెషల్ ఫీచర్లను వెల్లడించాడు ఓ టిప్‎స్టర్.

realme-narzo 60

త్వరలోనే లాంచ్:
త్వరలోనే భారత మార్కెట్లోకి రియల్ మీ నార్జో 60 స్మార్ట్‎ఫోన్‎ ను రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదే విషయాన్ని ఈకామర్స్ పోర్టల్ అమెజాన్ కూడా తెలిపింది. కానీ రిలీజ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ అంతకుముందే ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్ స్టర్ ముకుల్ శర్మ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రియల్ మీ నార్జో 60 సిరీస్ స్పెసిఫికేషన్స్ ను వెల్లడించాడు.

రియల్​మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే:
ఈ ఫోన్‌లో 6.43-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేతోపాటు 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ పొందవచ్చు.

ప్రాసెసర్:
కొత్త నార్జో 60 5జీ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని లీక్ లను బట్టి తెలుస్తోంది.

స్టోరేజీ:
డివైజ్‌లో 8 జీబీ ర్యామ్‌తోపాటు ర్యామ్‌ని పెంచడానికి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే, ఫోన్ గరిష్టంగా 1టీబీ స్టోరేజీ ఉంది.

కెమెరా:
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్‌తో ఉంటుంది, ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్‌ను పొందవచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

బ్యాటరీ:
రియల్​మీ నార్జో 60 5జీ 5,000ఎంఏహెచ్, 33వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది.

గీక్ బెంచ్ లీక్స్:
అంతకుముందు గీక్ బెంచ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్లను లీక్ చేసింది. గీన్ బెంజ్ లీక్ చేసిన వివరాల ప్రకారం సింగిల్ కోరర్ టెస్టింగ్ లో రియల్ మీ నార్జో 60 స్మార్ట్ ఫోన్ 714 పాయింట్స్ స్కోర్ చేసింది. మల్టీకోర్ పరీక్షలో 1,868పాయింట్లను స్కోర్ చేయగా..ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13ఓఎస్ పై పనిచేస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు