పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత

జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో వారాహి విజయ యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు పవన్‌. ప్రస్తుతం భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ కల్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు.

New Update
పవన్ కల్యాణ్‌కు తీవ్ర అస్వస్థత

Pawan Kalyan is seriously ill

వారాహి విజయ యాత్రకు విరామం

పవన్‌ కల్యాణ్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో వారాహి విజయ యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు పవన్‌. ప్రస్తుతం భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ కల్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి ఈ నెల 30న అంబేద్కర్ సెంటర్లో సభతో పవన్‌ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కాగా గత వారం రోజుల నుంచి వారాహి విజయ యాత్రలో బిజీబిజీగా ఉంటున్నారు పవన్‌. ఇప్పటికే తూ.గో జిల్లాను చుట్టేసిన ఆయన ప్రస్తుతం ప.గో జిల్లాలో పర్యటిస్తున్నారు. అవిశ్రాంతంగా సభలు, సమావేశాల్లో పాల్గొనడంతోనే పవన్‌ ఆరోగ్యం దెబ్బతినిందని తెలుస్తోంది. ఇక ఆరోగ్యం బాగోలేకపోయినా భీమవరం పార్టీ నేతలతో సమావేశమై.. పార్టీ పటిష్ఠతపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా భీమవరం సభలో మాట్లాడిన పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

 ఉపాధి లేక.. వలస

ఇక్కడ ఉపాధి లేక ఉత్తరాంధ్ర నుంచి తూర్పుకాపులు వలస బాటపట్టారన్నారు దేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరుగుతున్నా దాని వెన్నెముక తూర్పుకాపులై ఉంటారన్నారు పవన్‌. 52 శాతం మంది బీసీలుంటే… వారిలో ఉత్తరాంధ్ర నుంచి ఉన్న బీసీల్లో అత్యధిక మంది తూర్పుకాపులేనన్నారు. ఉత్తరాంధ్ర జనం సాహసికులన్నారు పవన్‌ కల్యాణ్‌. తూర్పుకాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారు. తెలంగాణలో కొందరిని బీసీ కులాల జాబితాలో నుంచి తీసేశారని ఆరోపించారు. అప్పుడు ఏ ప్రజాప్రతినిధీ ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో కాపులు తీవ్రంగా నష్టపోయారన్నారు పవన్‌.

బీసీలకి న్యాయం జరగటంలేదు

బీసీ జనాభా 26 లక్షలున్నారని టీడీపీ ప్రభుత్వం ప్రకటిస్తే…వైసీపీ దాన్ని సగానికి తగ్గించిందన్నారు పవన్‌ కల్యాణ్‌. బీసీ జనాభా 16 లక్షలేనని చెపుతోందని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన ప్రభుత్వాలు జనాభాని నిర్ణయిస్తాయని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్‌. పథకాలు అమలు చేయకుండా తప్పించుకునేందుకే ఈ కోత అన్నారు. రాష్ట్రంలోనే బీసీలకు జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించే నాయకులు కావాలన్నారు పవన్‌ కల్యాణ్‌. బీసీ గణాంకాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్‌ కల్యాణ్‌. అధికారంలోకి వచ్చాక గణాంకాలు వెలికితీస్తామని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు