ఘోరప్రమాదం..నదిలో పడిన మినీ ట్రక్.. 12 మంది మృతి మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ విరిగి మినీ ట్రక్కు నదిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. By Bhoomi 28 Jun 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. వంతెన రెయిలింగ్ విరిగి మినీ ట్రక్ నదిలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. మినీ ట్రక్ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనకు సంబంధించి హోంమంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. బుహరా గ్రామ సమీపంలో నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తికమ్‌గఢ్‌లోని వివాహా వేడుకకు వెళ్తున్న ట్రక్కు వంతెన సమీపంలో అదుపుతప్పి రెయిలింగ్ విరిగి బోల్తా పడింది. దీంతో ట్రక్కులో కూర్చున్న 12 మంది మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. ట్రక్కులో దాదాపు 50 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే దతియా ఎస్పీ ప్రదీప్ శర్మ, ఇతర పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. దీంతో పాటుగా క్షతగాత్రులను దతియా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని ఆదేశించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి