Telangana Elections: కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. అధికారులకు కీలక ఆదేశం..
నిన్న(మంగళవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి కౌషిక్ రెడ్డి.. తనకు ఓట్లేసి గెలిపిస్తే విజయ యాత్ర.. లేకపోతే నా శవయాత్ర అని చేసి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.