/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Money-2-jpg.webp)
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రస్తుతం సెక్షన్ 144 అమలులో ఉంది. కానీ నోట్ల కట్టలు మాత్రం సంచారం చేస్తున్నాయి. మొన్నటివరకు ప్రచారాల్లో మునిగిపోయిన నాయుకులు.. ఇప్పుడు ఓటర్లకు డబ్బులు పంచే పనిలో బిజీ అయిపోయారు. అధికారులు పెద్దఎత్తున నగదను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ రాయదుర్గంలోని రూ.1.68 కోట్లు పట్టుబడింది. రెండు కార్లలో జడ్చర్ల నుంచి రాయదుర్గంకు నగదు తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఆ డబ్బులు జడ్చర్లకు చెందిన ఓ పార్టీ నాయకుడిదిగా గుర్తించారు. ఆ తర్వాత ఆ డబ్బును ఐటీ అధికారులకు అప్పగించారు.
వరంగల్‌లోని వర్ధన్నపేట మండలం బొక్కలగూడెంలో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ బూత్ కన్వీనర్ల నివాసాల్లో తనిఖీలు చేయగా రూయ7.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ నేతలు వెంకటేశ్వరరావు, సాయి, మనోహర్‌పై కేసు నమోదు చేశారు.
Also Read:తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు
మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని నాలుగు చోట్ల రూ.60 లక్షల నగదు, రూ.కోటీ 10 లక్షల విలువైన బంగారం,ఆభరణాలు, రూ. కోటీ 2 లక్షల విలువైన బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.4.5 కోట్ల విలువైన లిక్కర్ పట్టుబడింది. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. గత కొన్నిరోజల నుంచి రాష్ట్రంలో పోలీసులు, ఐటీ అధికారులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదిలాఉండగా.. నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి పటేల్ రామారావు బంధువు ఇంట్లో పోలీసులు తనిఖీలు వెళ్లిన సమయంలో వారికి బీజేపీ కార్యకర్తలు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు తనిఖీలు చేయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. పలు వాహనాల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా.. రేపు (గురువారం) పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Also Read: భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? బండి సంజయ్ కి గంగుల సవాల్