Uttarkashi Tunnel: టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్‌ కంపెనీ..

ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన సంస్థ ముఖ్యపాత్ర పోషించింది. సొరంగంలో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్‌ యంత్రాన్ని కట్ చేసేందుకు బెరోలెక్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ప్లాస్మా ఆధారిత కట్టింగ్‌ను సూచించారు.

New Update
Tunnel Collapse: సొంరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆరోగ్యం క్షీణించొచ్చు: ఆరోగ్య నిపుణులు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగంలో చిక్కున్న 41 మంది కార్మికులను సహాయక బృందాలు సురక్షింతగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ఆపరేషన్‌లో హైదరాబాద్‌కు చెందిన బోరోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ ముఖ్యపాత్ర పోషించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్‌ 25న హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్ డాక్టర్‌ సతీష్‌రెడ్డిని సంప్రదించారు. టన్నెల్‌ పనులు చేస్తుండగా అందులో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కట్‌ చేసే విషయమై సలహా ఇవ్వాలని వారు సతీష్‌ రెడ్డిని కోరారు. దీంతో ఆయన ఆ డ్రిల్లింగ్‌ మిషన్‌ను కట్‌ చేసేందుకు ఉపయోగపడే పరికరాల కోసం స్థానిక పరిశ్రమలను సంప్రదించారు. అయితే ఈ తరుణంలోనే బెరోలెక్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన శ్రీనివాస్‌ రెడ్డి ఇందుకు ప్లాస్మా ఆధారిత కట్టింగ్‌ను సూచించారు.

Also Read: సింగిల్‌గా వచ్చాడు.. 25 కేజీల బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు.. ఎక్కడంటే..

ఆ తర్వాత 800 మి.మీ పైపులైన్‌ వ్యాసం కంటే తక్కువ వ్యాసం కలిగిన యంత్రాల కోసం పలువురిని సంప్రదించారు. చివరికి ఒక పరిశ్రమలో అలాంటి రెండు యంత్రాలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ యంత్రాలను, ఇద్దరు కట్టింగ్‌ నిపుణులను ప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్‌కు తీసుకెళ్లింది. వారు నవంబర్‌ 25న బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి డెహ్రడూన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే కొద్ది గంటల్లోనే సొరంగంలో అడ్డుపడిన అగర్ యంత్రం బ్లేడ్‌లను కట్‌ చేసే పనిని ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్‌కు అనువైన పరిస్థితులు కల్పించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారులు... టన్నె్ల్‌ సహాయక చర్యల్లో సాయం అందించిన బెరోలెక్స్‌ ఇండస్ట్రీస్‌ చెందిన శ్రీనివాస్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read: ‘హలో.. నేను మీ కేసీఆర్’.. ప్రజలకు గులాబీ బాస్ ఫోన్‌ కాల్‌..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు