Watch video: హెల్మెట్‌లోకి దూరిపోయిన పాము.. చివరికి

పాములు ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమవుతుంటాయి. తాజాగా ఓ హెల్మెట్‌లో దూరడం కలకలం రేపింది. ఓ నాగుపాము బుసలు కొడుతూ ఆ హెల్మెట్‌లో కనిపించడం చూసి ఆ బైక్‌ ఓనర్‌ షాకైపోయాడు.హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గుర్తించి ప్రాణాలు కాపాడుకున్నాడు.

New Update
Watch video: హెల్మెట్‌లోకి దూరిపోయిన పాము.. చివరికి

పాములు ఎప్పుడైనా, ఏ చోటైన మనకు కనిపిస్తుంటాయి. జనావాసాల్లో పాములు సంచరించినప్పుడు అక్కడి స్థానికులు కొన్నిసార్లు పాములు పట్టేవారికి చెబుతారు. మరికొన్నిసార్లు ఆ పామును చంపేస్తారు. ఈ మధ్య పాములు కార్లు, బైకులు ఇలా కనిపించిన చోట్లకి దూరిపోతున్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి హెల్మెట్‌లోకి పాము దురడం కలకలం రేపింది. ఓ నాగుపాము బుసలు కొడుతూ ఆ హెల్మెట్‌లో కనిపించడం చూసి ఆ బైక్‌ ఓనర్‌ షాకైపోయాడు. ఈ వీడియోను దేవ్ శ్రేష్ట అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. నేలపై ఉంచిన హెల్మెట్‌లో పాము కనిపిస్తుంది. హెల్మెట్‌లో పాము ఉన్న విషయాన్ని అతడు ముందుగానే గుర్తించి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Dev Shrestha (@d_shrestha10)

Also Read: ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా?

అయితే పాములు ఇలా హెల్మెట్‌లో దూరడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే కేరళలోని ఓ ప్రాంతంలో పార్క్‌ చేసిన బైక్‌ హెల్మెట్‌లో పాము దూరింది. సోజన్ అనే వ్యక్తి తాను పనిచేసే ప్రాంతంలో ఓ చోట బైక్‌ను పార్క్‌ చేసి ఉంచాడు. పని ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు అతడు బైక్ తీశాడు. కానీ హెల్మెట్‌లో పాము పిల్ల ఉండటాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. చివరికి పాములు పట్టే అతనికి సమాచారం ఇచ్చాడు. చివరికి హెల్మెట్‌ నుంచి ఆ పామును బయటకు తీసి అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.

Also Read: ఉత్తరాఖండ్ టన్నెల్ సక్సెస్ వెనుక ఉన్న ఆస్ట్రేలియన్ నిపుణుడు

Advertisment
Advertisment
తాజా కథనాలు