Anand Mahindra: టన్నెల్‌ నుంచి కార్మికుల రాకపై ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌ వైరల్.. ఏమన్నారంటే

ఉత్తరకాశీలో టన్నెల్‌ నుంచి కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహింద్రా స్పందించారు. మీ శ్రమ వల్ల ఓ దేశం ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు.. ఒక్క ఆశపై అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చారంటూ రెస్క్యూ టీమ్‌పై ప్రశంసలు కురిపించారు.

New Update
Anand Mahindra: టన్నెల్‌ నుంచి కార్మికుల రాకపై ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌ వైరల్.. ఏమన్నారంటే

ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీలో సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకురావడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సొరంగంలో 17 రోజుల పాటు ఉండిపోయిన కార్మికుల ధైర్యసాహసాలకు.. వారిని కాపాడిన సహాయక బృందాలకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే తాజాగా దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్‌(ట్విట్టర్‌)లో స్పందించారు. 'సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల ప్రాణాలు రక్షించేందుకు శ్రమించిన ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు. దేశంలో ఏ ఆట విజయం ఇవ్వని ఆనందాన్ని మీరు ఈరోజు అందించారు. మీ శ్రమ వల్ల ఓ దేశం ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు.. ఒక్క ఆశపై అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఎలాంటి కష్టమైన సొరంగమైన మనల్ని బయటపడకుండా ఆపలేదని నిరుపించారు అంటూ మహింద్రా రాసుకొచ్చారు.

Also Read:భాగ్యలక్ష్మి టెంపుల్లో ప్రమాణం చేద్దామా? బండి సంజయ్ కి గంగుల సవాల్

ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కార్మికులను కాపాడిన సహాయక బృందాలను అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే కొన్నిరోజు క్రితం ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్‌క్యారా అనే సొరంగం కూలింది. దీంతో అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారికి అధికారులు నీరు, ఆహారం, ఆక్సిజన్‌ను పైపుల ద్వారా సరఫరా చేశారు. కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు డ్రిల్లింగ్ యంత్రాలు మోరాయించడం, అందులో ఇరుక్కోవడం లాంటి అనేక సమస్యలు ఎదురయ్యాయి. చివరికి 17 రోజులు పాటు రెస్క్యూ టీం అహర్నిశలు శ్రమించిన తర్వాత కార్మికులను సరక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

Also read: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు