/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Kaushik-Reddy-jpg.webp)
హుజురాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న (మంగళవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై.. కమలాపూర్ MPDO పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లాంఘించారనే ఆరోపణలతో కమాలాపూర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి తమకు నివేదిక అందించాలని హుజురాబాద్ ఎన్నికల అధికారులకు ఆదేశించింది. అయితే మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కౌశిక్ రెడ్డి.. ఎన్నికల్లో నాకు ఓటేసి గెలిపిస్తే జైత్రయాత్ర.. ఓడిపోతే శవయాత్ర ఉంటుందని.. ఏ యాత్ర కావాలో మీరే నిర్ణయించుకోండని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Also Read: వేంకటేశ్వరుడి ముందు కాంగ్రెస్ గ్యారంటీ కార్డు..రేవంత్ ప్రత్యేక పూజలు