Type-1 Diabetes: టైప్‌-1 డయాబెటిస్‌ సమస్యకు చెక్.. ఇక ఇన్సూలిన్ ఇంజెక్షన్ అవసరం లేదు..

టైప్‌-1 డయాబెటిస్‌ ఉన్నవారు ప్రతిరోజూ ఇన్సూలిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా అమెరికాకు చెందిన ఓ ఔషధ కంపెనీ 'స్టెమ్‌ సెల్‌' చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది.అమెరికా, కెనడా, బెల్జియంలో క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చాయి.

New Update
Diabetes: డయాబెటిస్ బాధితుల్లో పెరుగుతున్న కొవిడ్‌యేతర మరణాలు

చాలామంది డయాబెటిస్‌ సమస్యలతో బాధపడుతుంటారు. కానీ ఇప్పటివరకు డయాబెటిస్‌ను అంతం చేసే ఔషధం రాలేదు. అయితే తాజాగా టైప్‌-1 డయాబెటిస్‌ రోగుల కోసం అమెరికాకు చెందిన వయాసైట్‌ అనే ఔషధ తయారీ కంపెనీ 'స్టెమ్‌ సెల్‌' చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇటీవల దీనికోసం అమెరికా, కెనడా, బెల్జియంలో క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించారు. అయితే ఈ ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని ప్రముఖ జర్నల్ నాచుర్ బయోటెక్నాలజీ నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవడం కోసం ప్రతిరోజు ఇన్సూలిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపింది. వీసీ-02 అనే చిన్న పరికరం శరీరం లోపల నిర్వర్తిస్తుందని నివేదిక చెప్పింది. అయితే నిరంతరం ఇన్సులిన్ విడుదలపై స్వీయ నియంత్రణ చేపట్టేందుకు ఓ చిన్న పరికరాన్ని రోగి చర్మం లోపల ప్రవేశపడతారు.

Also Read: ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ రెస్క్యూ సక్సెస్‌.. బయటికి వచ్చిన 41 మంది కార్మికులు.!

ఈ పరికరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కర్మాగారంగా శరీరం లోపల పనిచేస్తుందని.. ‘యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా’ ప్రొఫెసర్‌ టిమోతీ కిఫర్‌ తెలిపారు. కెనడాలోని వాంకోవర్‌ జనరల్ దవాఖాన, అమెరికా బెల్జియంలలో పరిశోధకులు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఆరు నెలల తర్వాత రోగులను పరిశీలించారు. వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయి. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో ప్రతిరోజూ బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నివేదిక వెల్లడించింది.

Also Read: తప్పకుండా ఓటేయండి.. గవర్నర్ తమిళి సై సందేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు