ఐదు రోజులు నిద్రలేకుండా లైవ్‌ స్ట్రీమింగ్ గేమ్ ఆడాడు.. చివరికి

చైనాలో ఓ విద్యార్థి అయిదు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా లైవ్‌ స్ట్రీమింగ్ గేమ్‌ ఆడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా లైవ్‌ స్ట్రీమింగ్ గేమింగ్ సెషన్‌లో చేరిన అతడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. చివరికి అతను అస్వస్థకు గరై మృతి చెందడం కలకలం రేపింది.

New Update
ఐదు రోజులు నిద్రలేకుండా లైవ్‌ స్ట్రీమింగ్ గేమ్ ఆడాడు.. చివరికి

ఈ మధ్య చాలామంది లైవ్‌ స్ట్రీమింగ్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే ఓ విద్యార్థి నిద్రాహారాలు లేకుండా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసి చివరకి తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన చైనాలో చోటుచోసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హెనాన్స్ పింగ్డింగ్షాన్‌ వొకేషనల్‌ అండ్‌ టెక్నికల్‌ కళాశాలలో లీ హావో అనే విద్యార్థి ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. అతను హెనన్‌లో తన స్నేహితులతో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా లైవ్‌ స్ట్రీమింగ్ గేమింగ్ సెషన్‌లో చేరాడు. అయితే ఇందులో 26 రోజుల్లో 240 గంటలపాటు లీ హావో లైవ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

Also Read: ఓటర్ కార్డు లేకపోయినా ఓటేయొచ్చు..ఎలాగో తెలుసా?

ఇలా చేసినందుకు సదరు కంపెనీ 3 వేల యువాన్లు అంటే మన కరెన్సీలో రూ.35 వేలకు పైగా జీతాన్ని అతనికి చెల్లిస్తుంది. అయితే లీ హావోకు ఆ కంపెనీ రాత్రి షిప్ట్‌ కేటాయించింది. కానీ లీ హావో మాత్రం వరుసగా అయిదు రోజుల పాటు నిద్ర లేకుండా లైవ్‌లో పాల్గొన్నాడు. చివరికి తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. దీంతో అతను అస్వస్థకు గురయ్యాడు. ఇది గమనించిన లీ హావో స్నేహితులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే గతంలో కూడా 25 రోజుల్లో 89 లైవ్‌ సెషన్లను లీ హావో నిర్వహించినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది. మరోవైపు ఆ యువకుడు ప్రాణాలు పోవడానికి ఆ కంపెనీయే కారణం అనే నిరసనల వ్యక్తం అయ్యాయి. అయితే ఈ ఆరోపణలను ఆ సంస్థ తోసిపుచ్చింది. లీ హావోకు రావాల్సిన వేతనాన్ని అతని తండ్రికి అందించింది.

Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు