Nitish Kumar: నువ్వొక మహిళవు.. అసలు నీకేమైనా తెలుసా?
కేంద్ర బడ్జెట్ లో బీహార్‌కు ప్రత్యేక హోదా దక్కకపోవడంతో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితిశ్ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నితిశ్ ఓ మహిళ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Bihar: బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం..స్పష్టం చేసిన కేంద్రం!
బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలేమని కేంద్రం వివరించింది. ఈ వివరణతో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్ చేసిన విపక్షాలు
నేడు బిహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్ కుమార్ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. మరోవైపు స్పీకర్‌గా ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది.
Bihar Floor Test : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. ఆ ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ ఆఫ్!
బీహార్ అసెంబ్లీలో కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటివలే మహాకుటమీని వదిలి బీజేపీ పక్షనా చేరారు జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్. నితీశ్‌కు ప్రస్తుతం 128మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. అందులో ఐదుగురు ఫోన్లు స్విచ్ఆఫ్ అయ్యాయి. అవిశ్వాసం నెగ్గడానికి మ్యాజిక్ ఫిగర్ 122.
PM Modi : బీహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం..ఏ అవకాశాన్ని వదలబోమన్న ప్రధాని మోదీ..!!
బీహార్‌లో ఎన్డీయేతో కలిసి నితీశ్ కుమార్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
Nitish Kumar: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Bihar : రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా..!
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ మిత్రపక్షంగా మళ్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కూటములను మార్చడం నితీశ్ కుమార్‌కు ఇదేమీ కొత్త కాదు.
Bihar Politics: మారనున్న లెక్కలు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు.. నితీశ్ రాజీనామాకు రంగం సిద్ధం!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ(జనవరి 28) తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ RJD- కాంగ్రెస్‌తో తన 18 నెలల పాలక పొత్తుకు ముగింపు పలకనున్నారు. బీజేపీతో కలిసి ఆయన తిరిగి ఎన్డీఏలోకి తిరిగి వెళ్లనున్నారు.