Prashant Kishor: పార్టీ మారనున్న నీతీశ్ కుమార్‌.. బిహార్‌ రాజకీయాల్లో పీకే సంచలనం!

బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కూటమి మారనున్నట్లు తెలిపారు. సీఎం పదవికోసం నితీశ్ పార్టీ మారడం ఖాయమని, ఇది నిజంకాకుంటే తాను రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటానన్నారు. 

New Update
bihar

bihar Photograph: (bihar)

P Kishor: బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన కూటమి మారనున్నట్లు తెలిపారు. సీఎం పదవికోసం నితీశ్ పార్టీ మారడం ఖాయమని, ఇది నిజంకాకుంటే తాను రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటానన్నారు. 

రాజకీయ ప్రచారం నుంచి తప్పుకుంటా.. 

ఈ మేరకు బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్.. బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నీతీశ్ కుమార్‌ పోటీ చేయబోతున్నారని జోష్యం చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ ఆయనకు కాకుండా ఎవరికైనా ఇస్తే తప్పకుండా కూటమి మారుతాడన్నారు. అయితే నీతీశ్ ఏ కూటమిలో ఉన్నా అతన్ని ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. 'జేడీ (యూ) అధినేత పార్టీ మారబోతున్నారు. ఇది జరిగి తీరుతుందని నేను రాసి ఇస్తా. నేను చెప్పింది జరగపోతే రాజకీయ ప్రచారం నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పారు. 

Also Read:  అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం

బిహార్ ఎలక్షన్స్ ముందు సీఎం అభ్యర్థిగా నీతీశ్‌ కుమార్ ను ప్రకటించాలంటూ మోదీ, అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు. నీతీశ్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఒకవేళ అలా చేస్తే బీజేపీకి సీట్లు రావడం కష్టం. జేడీ(యూ) ఎక్కువ సీట్లు గెలవదు. నీతీశ్ కు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకోకపోతే ఆయన తప్పకుండా కూటమి మారే ఛాన్స్ ఉందని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన నితీశ్ ఇక సీఎం కాలేరన్నారు. 

Also Read: ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్‌లో 12 మంది..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు