Bihar Assembly Elections: బీహార్ లో ఈ సారి సీన్ రివర్స్.. గేమ్ ఛేంజర్ గా ప్రశాంత్ కిషోర్ .. మారిన లెక్కలివే!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని క్షేత్రస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి.

author-image
By B Aravind
New Update
Bihar Assembly Elections

Bihar Assembly Elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య గట్టి పోటీ ఉంటుందని క్షేత్రస్థాయి పరిస్థితులు సూచిస్తున్నాయి.  పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ కలిసి అసెంబ్లీ ఎన్నికలపై ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించాయి. ఇందులో ఎన్డీయే కూటమికి 41 నుంచి 44 శాతం, ఇండియా కూటమికి 40 నుంచి 42.5 శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వేలో తేలింది. అంతేకాదు ప్రశాంత్ కిశోర్‌ స్థాపించిన జన్‌ సురాజ్‌ పార్టీ కూడా 6 నుంచి 8 శాతం ఓట్లు రాబట్టుకోనే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడైంది. ఇతరులు 7.5 నుంచి 9 శాతం ఓట్లు పొందే ఛాన్స్ ఉన్నట్లు మూడ్‌ సర్వే పేర్కొంది. 

Also Read: బీహార్ ఎన్నికల్లో సరికొత్తగా 17 మార్పులు.. తర్వాత దేశమంతా.. అవేంటో తెలుసా?

కింగ్‌మేకర్‌గా ప్రశాంత్ కిషోర్‌ ?

ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్‌/మైనస్‌ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ ఉండనుందనేది స్పష్టవుతోంది. మొత్తంగా సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎన్డీయే కూటమి.. ఇండియా కూటమిపై కేవలం ఒక్క శాతం ఓటింగ్‌తో గెలిచే వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఎన్నికల సమయం దగ్గరికొచ్చే సమయానికి ఈ ఓటింగ్ శాతం మారొచ్చు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా కింగ్‌ మేకర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 123 సీట్లు రావాలి. రెండు కూటమిలకు మ్యాజిక్‌ ఫిగర్‌కు కాస్త దగ్గరిగా వచ్చినా ప్రశాంత్ కిషోర్‌కు వచ్చే సీట్లు కీలకంగా మారనున్నాయి. ఆయన సొంతంగానే బరిలోకి దిగుతామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తారని ఆసక్తిగా మారింది. ఆయన కింగ్‌ మేరక్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా పలువురు నిపుణులు చెబుతున్నారు. 

Also Read: సుప్రీం కోర్టులో హై టెన్షన్.. న్యాయవాది CJIపై చెప్పులు విసిరేందుకు యత్నం!

గత ఎన్నికల్లో పరిస్థితి

ఇదిలాఉండగా 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎన్డీయే, మహాఘట్ బంధన్‌ కూటములు చెరో 37 శాతం ఓట్లు గెలుచుకున్నాయి. ఈ రెండు కూటముల మధ్య కేవలం 11 వేలు మాత్రమే వ్యత్యాసం వచ్చింది. ఆర్జేడీకీ 75 స్థానాలు రాగా.. బీజేపీ 74 స్థానాల్లో గెలిచాయి. ఇక జేడీయూకు 43 సీట్లు వచ్చాయి. మొత్తంగా చూసుకుంటే బీజేపీ, జేడీ(యూ), ఎల్జేపీ, హిందుస్తానీ ఆవామ్‌ మోర్చా పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమికి 43.17 శాతం ఓట్లు రాగా.. ఆర్జేడీ,కాంగ్రెస్, కమ్యూనిస్టులతో కూడిన మహాఘట్ బంధన్‌ కూటమికి 38.75 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎన్డీయే ప్రభుత్వం నేతృత్వంలో నితిశ్ కుమార్‌ ఏడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఆగస్టులో NDAకు గుడ్ బై చెప్పిన ఆయన సీఎం పోస్టుకు రిజైన్ చేశారు. అదేరోజు ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక పార్లమెంటు ఎన్నికలకు ముందు 2024 జనవరిలో మళ్లీ రాజీనామా చేసి ఎన్డీయే కూటమి గూటికి చేరి తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

బీహార్‌లో బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన NDA కూటమి ముఖ్యంగా అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత కమ్యూనిటీ ఓటర్లను గతంలోలాగే టార్గెట్ చేసింది. ఇక కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ఇండియా కూటమి యాదవ, ముస్లిం, ఓబీసీ సామాజిక వర్గాలపై ఆశలు పెట్టుకుంది. అయితే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్‌సూరజ్‌ పార్టీ ఎవరి ఓట్లు చీల్చుతుందనే అంశంపై ప్రధాన పార్టీల్లో టెన్షన్ నెలకొంది. మరోవైపు ఆర్జేడీ, కాంగ్రెస్‌.. MIM పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. కానీ ఎంఐఎం దీనిపై ఆసక్తి చూపించడం లేదు. గత ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన MIM.. ఈసారి 25 సీట్లలో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. బీహార్‌లో మొత్తం 17.7 శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్డీయే, ఇండియా కూటములు, జన్‌ సూరజ్‌ పార్టీ ఓటర్లను తమ వైపు ఆకర్షించుకునేందుకు పలు హామీలు ప్రకటించాయి.  

NDA హామీలు

1.75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ
2.125 యూనిట్ల ఉచిత విద్యుత్ 
3.కోటి ఉద్యోగాలు
4.ట్రైబెల్స్ కు భూమి హక్కులు
5.మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలు

ఇండియా కూటమి హామీలు

1.200 యూనిట్ల ఉచిత విద్యుత్, 
2.ప్రతీ మహిళకు నెలకు రూ.2500, 
3.రాష్ట్రంలో వలసల నివారించేందుకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు
4. ప్రతీ పంచాయతీలో ఐటీఐ 
5.అన్ని రంగాల్లో మహిళా కోటా, వారికి భద్రత ఇస్తామని హామీ

జన్‌సూరజ్ పార్టీ హామీలు 

1. పంచాయత్ స్కూల్స్ ఏర్పాటు చేయడం
2. యువతకు ఉద్యోగాలు
3. వృద్ధులకు రూ.2000 పింఛన్
4. మహిళలకు రుణాలు 
5.రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవడం 

Advertisment
తాజా కథనాలు