UNION BUDGET 2025: నిర్మలమ్మ గుడ్ న్యూస్.. టీవీలు, ఫోన్లు, బట్టలతో పాటు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే!
కేంద్ర బడ్జెట్లో మొబైల్, టీవీతో పాటు మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు వాడే మందులు, ఖనిజాల ధరలు తగ్గుతాయి. మొత్తం 82 వస్తువులపై ప్రభుత్వం సెస్‌ను తొలగించనుంది.