Union Budget 2026 : సీఎన్‌జీ కార్లు, ఆటోలకు నిర్మలమ్మ గుడ్ న్యూస్! .. ఇక పండగే!

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  లోక్సభలో ప్రవేశ పెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.

New Update
Auto and car

కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  లోక్సభలో ప్రవేశ పెట్టారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా బడ్జెట్‌లో ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. బయో గ్యాస్ కలిపిన సీఎన్‌జీ  పై పన్ను లెక్కింపు పద్ధతిని మార్చుతూ, భారీ ఊరటను ప్రకటించారు.

సీఎన్‌జీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు

ప్రస్తుతం మనం వాడే సీఎన్‌జీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కొంత శాతం బయో గ్యాస్ కలుపుతుంటారు. అయితే, ఇప్పటివరకు పన్ను లెక్కింపు మొత్తం ఇంధనం ధరపై జరిగేది.అయితే ఇకపై సీఎన్‌జీలో ఎంత శాతం బయో గ్యాస్ ఉంటుందో, ఆ బయో గ్యాస్ విలువపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు. పన్ను లెక్కించేటప్పుడు ఆ విలువను పూర్తిగా మినహాయిస్తారు.

పన్ను భారం తగ్గడం వల్ల సీఎన్‌జీ ధరలు తగ్గి, కార్లు, ఆటోలు నడిపే వారికి కిలోమీటరుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్‌జీ చౌకగా దొరికితే.. ఎక్కువ మంది పర్యావరణ హితమైన గ్యాస్ బండ్ల వైపు మొగ్గు చూపుతారు. ధరలు తగ్గడం వల్ల సీఎన్‌జీ కార్లు, బస్సుల విక్రయాలు పెరుగుతాయి. ఆటో కంపెనీలు కూడా కొత్త టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిర్ణయం తోడ్పుతుంది.

ఈ నిర్ణయం వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది. బయో గ్యాస్‌ను మనం పంట వ్యర్థాలు, చెత్త నుంచి తయారు చేస్తాం. దీనికి డిమాండ్ పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు పెరుగుతాయి. తద్వారా రైతులకు తమ పంట వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది.

Advertisment
తాజా కథనాలు