Union Budget 2026: రైతులకు అదిరిపోయే వార్త..ఈ పంటలకు భారీ ప్రోత్సాహం!

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది.

New Update
nir

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ప్రకటించింది. కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్‌లో అధిక విలువ కలిగిన పంటల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా నిర్మలా సీతారామన్ పలు కీలక ప్రకటనలు చేశారు. 

తీరప్రాంత రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కొబ్బరి ప్రోత్సాహక పథకం ప్రకటించింది. కాయలు కాయని, ముసలి కొబ్బరి చెట్ల స్థానంలో అధిక దిగుబడినిచ్చే కొత్త రకాలను నాటేందుకు రైతులకు భారీగా ప్రోత్సాహకాలు అందించనున్నారు. తీరప్రాంతాల్లో జీడిపప్పు, కోకో సాగును విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీటి కోసం నాణ్యమైన విత్తనాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.

మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 500 ప్రధాన రిజర్వాయర్లలో చేపల అభివృద్ధికి సమగ్ర చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఆయా నీటి వనరుల వద్ద కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. మత్స్య సంపద ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గంధం సాగుకు అనువైన ప్రాంతాల్లో ప్రత్యేక వనాల ఏర్పాటుకు రాయితీలు ఇవ్వనున్నారు. కొండ ప్రాంతాలు మరియు అనువైన జిల్లాల్లో బాదం, వాల్‌నట్స్, పైన్‌నట్స్ సాగు కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించారు.పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం రంగాల్లో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే యువతకు తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు అందించనున్నారు.

Advertisment
తాజా కథనాలు