Budget 2024: అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. వికసిత్ భారత్ లో అణు విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుందని నిర్మలమ్మ చెప్పారు. అందుకే మొట్టమొదటిసారిగా ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు.

New Update
Budget 2024: అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు

Invest In Atomic Energy: భారత అణువిద్యుత్ రంగం నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రంగానికి సానుకూల స్పందన లబించింది. చిన్న రియాక్టర్ల అభివృద్ధికి భారత్ సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దానికి అణుగుణంగా అణు విద్యుత్ రంగంలో తొలిసారి ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.

చిన్న రియాక్టర్ల అభివృద్ధిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్‌ ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో.. భారత్‌ స్మాల్‌ రియాక్టర్ల ఏర్పాటులో, భారత్‌ స్మాల్‌ మాడ్యులర్‌ రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధిలో మా ప్రభుత్వం ప్రైవేట్‌ సెక్టార్‌తో కలిసి పనిచేయనుందని చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్‌ అండ్‌ డీ నిధులు ఈ రంగానికి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈ రంగంలోకి ప్రైవేట్‌ సెక్టార్‌ను అనుమతించడం పెద్ద పరిణామమని నీతి ఆయోగ్‌లోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సభ్యుడు వీకే సారస్వత్‌ తెలిపారు. ఆర్ధిక మంత్రి ప్రతిపాదనలకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిన్న రియాక్టర్ల అభివృద్ధి దేశానికి ఎంతో మేలు చేస్తుందని సారస్వత్ అన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు