National: కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి రూ.8,500 కోట్లు –ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్

జనధన్‌తో పాటూ మరే ఇతర అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉండక్కర్లేదని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పేద ప్రజల ఖాతాల నుంచి జరిమానాలను వసూలు చేయలేదని రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె తెలిపారు.

New Update
BREAKING: 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. బడ్జెట్లో వరాల జల్లు

Nirmala Sitaraman: పేదవారి జన్‌ ధన్‌ ఖాతాలతో పాటు, ప్రాథమిక పొదుపు ఖాతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఐదేళ్ళల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఖాతాల నుంచి పెనాటీలను వసూలు చేయడం మీద రాజ్యసభలో చర్చ జరిగింది. దీని మీద నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 8,500 కోట్లు వసూలు చేశామని చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదలుకొని అయిదేళ్ల కాలంలో వినియోగదారుల నుంచి పీఎస్‌బీలు జరిమానాలు విధించాయి. ఇందులో ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే డిపాజిటర్ల నుంచి పీఎస్‌బీలు రూ.2,331 కోట్లు వసూలు చేశాయని చెప్పారు. అయితే వీటిలో పేద ప్రజల ఖాతాలు ఏమీ లేవని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. పేద ప్రజల ప్రాథమిక ఖాతాలకు వసూళ్ళ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.

Also Read: Bangladesh: ప్రభుత్వాన్ని కూల్చేసిన 26ఏళ్ళ కుర్రాడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు