Jaishankar: ఐక్యరాజ్యసమితిని తప్పుబట్టిన విదేశాంగ మంత్రి.. UNOపై విమర్శలు గుప్పించిన జైశంక‌ర్

ఐక్యరాజ్యస‌మితి ప‌నితీరును విదేశాంగ మంత్రి జైశంక‌ర్ త‌ప్పుప‌ట్టారు. యునైటెడ్ నేష‌న్స్‌పై తీవ్ర విమ‌ర్శలు చేసిన ఆయ‌న‌.. ఆ సంస్థ గ్రిడ్‌లాక్ అయ్యింద‌న్నారు. ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తోంద‌న్నారు. ప్రాతినిధ్యం మ‌రిచిపోయింద‌న్నారు.

New Update
External minister Jai shankar says operation sindoor has not stopped

External minister Jai shankar says operation sindoor has not stopped

ఐక్యరాజ్యస‌మితి ప‌నితీరును విదేశాంగ మంత్రి జైశంక‌ర్(s-jaishankar) త‌ప్పుప‌ట్టారు. యునైటెడ్ నేష‌న్స్‌పై తీవ్ర విమ‌ర్శలు చేసిన ఆయ‌న‌.. ఆ సంస్థ గ్రిడ్‌లాక్ అయ్యింద‌న్నారు. ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రిస్తోంద‌న్నారు. ప్రాతినిధ్యం మ‌రిచిపోయింద‌న్నారు. ఉగ్రవాదం, ప్రపంచ ప్రగ‌తిపై నిర్ణయాలు తీసుకోవ‌డం విఫ‌ల‌మైన ఆ సంస్థ త‌న విశ్వాసాన్ని కోల్పోయిన‌ట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో చోటుచేసుకున్న భౌగోళిక-రాజకీయ మార్పులకు అనుగుణంగా మారడంలో UNO ఘోరంగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో UNO 'నిస్సత్తువ', 'ప్రతినిధిత్వం లేని' సంస్థగా మారిందని ధ్వజమెత్తారు.

న్యూఢిల్లీ(new-delhi)లో జరిగిన ఐరాస 80వ వార్షికోత్సవ సంబంధిత కార్యక్రమంలో ప్రసంగించిన జైశంకర్, ఐక్యరాజ్యసమితి ప్రస్తుత నిర్మాణం 1945 నాటి ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబిస్తోందే తప్ప, 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనే విధంగా లేదని అన్నారు. ముఖ్యంగా, భద్రతా మండలిలో మార్పులు తక్షణ అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగానికిపైగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు, 'గ్లోబల్ సౌత్' గళాన్ని ఐక్యరాజ్యసమితి విస్మరిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read :  ఢిల్లీ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. యమునా నీళ్లు తాగాలంటూ ఆప్‌ నేతల ఆందోళనలు

ఉగ్రవాదంపై చర్యల్లో వైఫల్యం:

ఐరాస వైఫల్యాల్లో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోకపోవడం ప్రధానమైనదని జైశంకర్ విమర్శించారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు, వాటికి అండగా నిలుస్తున్న కొన్ని దేశాలకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఐరాస గ్రిడ్‌లాక్ అయిందని, అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉందని ఎత్తి చూపారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమస్యగా గుర్తించడంలోనూ, వాటిని ప్రోత్సహించే దేశాలపై ఆంక్షలు విధించడంలోనూ ఐరాసలోని ఏకపక్ష వైఖరి అడ్డుపడుతోందని ఆయన పరోక్షంగా కొన్ని శాశ్వత సభ్యదేశాలను విమర్శించారు. 'ఐక్యరాజ్యసమితిలో అంతా సవ్యంగా లేదు' అనే వాస్తవాన్ని సభ్యదేశాలన్నీ గుర్తించాలని జైశంకర్ తెలిపారు. ప్రపంచ సవాళ్లకు సరైన పరిష్కారాలను అందించడంలో సంస్థ తన విశ్వసనీయతను కోల్పోతోందని అన్నారు. భారత్ వంటి బలమైన దేశాలు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడం ద్వారానే UNO మరింత సమగ్రంగా, ప్రభావవంతంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, ప్రగతిని కాపాడాలంటే ఐరాస సంస్కరణ అనివార్యమని ఆయన ఉద్ఘాటించారు.

Also Read :  ఫామ్‌హౌస్‌లో ఆయుధాల తయారీ.. పోలీసుల దాడులు

Advertisment
తాజా కథనాలు