/rtv/media/media_files/2025/10/02/ramleela-2025-10-02-20-33-56.jpg)
దేశ వ్యాప్తంగా విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దసరా పండగ వేళ కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె రామబాణం ఎక్కుపెట్టగా.. రావణ దహనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉంది. అయితే, వర్షం కారణంగా ఆయన కార్యక్రమం రద్దు చేయబడింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగిన దసరా ఉత్సవాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఉదయపూర్‌లోని స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాధుడి దిష్టిబొమ్మలను ఈ పండగ వేళ దహనం చేస్తారు.
President Droupadi Murmu attends burning of effigies of Ravan, Meghnad, Kumbhakaran in Delhi's Red Fort. pic.twitter.com/Fi9r39n2yw
— News Arena India (@NewsArenaIndia) October 2, 2025