IAFలో మిగ్ 21కి గుడ్ బై.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా?

భారత వాయుసేన (IAF) మిగ్-21 (MiG-21)ఫైటర్ జెట్‌లను నేడు అధికారికంగా రిటైర్ చేస్తోంది. మిగ్-21 యుద్ధ విమానం భారత వైమానిక దళంలో దాదాపు ఆరు దశాబ్దాల సేవ తర్వాత, సెప్టెంబర్ 26న అధికారికంగా రిటైర్ అవుతోంది.  

New Update
mig21

భారత వాయుసేన (IAF) మిగ్-21 (MiG-21)ఫైటర్ జెట్‌లను నేడు అధికారికంగా రిటైర్ చేస్తోంది. మిగ్-21 యుద్ధ విమానం భారత వైమానిక దళంలో దాదాపు ఆరు దశాబ్దాల సేవ తర్వాత, సెప్టెంబర్ 26న అధికారికంగా రిటైర్ అవుతోంది.  మిగ్-21ల చివరి స్క్వాడ్రన్ అయిన 23వ స్క్వాడ్రన్ పాంథర్స్ ను రిటైర్ చేస్తున్నారు. డిఫెన్స్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు ఈ కార్యకర్మానికి హాజరవుతారు.  ఈ స్క్వాడ్రన్ రాజస్థాన్‌లోని నాల్ ఎయిర్ బేస్ లో ఉంది. మిగ్-21మిగ్-21 భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్. ఇది 1963లో వాయుసేనలో చేరి, 1965, 1971 పాకిస్తాన్ యుద్ధాలు, 1999 కార్గిల్ సంఘర్షణ, 2019 బాలాకోట్ దాడులతో సహా అనేక కీలక ఆపరేషన్లలో పాల్గొనింది.

1965,1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో మిగ్-21 కీలకమైన యుద్ధ విమానం. 1999 కార్గిల్ సంఘర్షణలో, 2019 బాలకోట్ వైమానిక దాడులలో కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి 2019లో బాలకోట్ వైమానిక దాడి సమయంలో, మిగ్-21 పాకిస్తాన్ ఆధునిక F-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేసింది. F-16 యునైటెడ్ స్టేట్స్ ఇప్పటివరకు నిర్మించిన అత్యంత విజయవంతమైన ఫైటర్ జెట్‌లలో ఒకటి. F-16ను విజయవంతంగా కూల్చివేసిన తర్వాత, మిగ్-21 ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

1950లో రష్యా డెవలప్

మిగ్-21 యుద్ధ విమానాన్ని రష్యా 1950లో డెవలప్ చేసింది. దీనిని 1963లో భారత వైమానిక దళంలో చేర్చారు. మిగ్-21  ఎక్కువ కాలం సేవలందించిన యుద్ధ విమానం. మిగ్-21 మాక్ 2 వేగాన్ని కలిగి ఉంది. ఇది 1,470 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. 9,800 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. ఈ విమానం క్షిపణి సంస్థాపనల కోసం నాలుగు హార్డ్‌పాయింట్‌లతో అమర్చబడింది.

గత కొన్ని సంవత్సరాలుగా, మిగ్-21 ఫ్లయింగ్ కాఫిన్ గా ప్రసిద్ధి చెందింది. దీనికి కారణం వరుసగా జరిగిన మిగ్-21 ప్రమాదాలు. భారత వైమానిక దళంలో చేరినప్పటి నుండి, వందలాది మిగ్-21లు కూలిపోయి వందలాది మంది పైలట్ల ప్రాణాలను బలిగొన్నాయి. అయితే, మిగ్-21ను "ఫ్లయింగ్ కాఫిన్" అని పిలవడం తీవ్ర అన్యాయమని చాలా మంది వైమానిక దళ నిపుణులు వాదిస్తున్నారు. 

మిగ్-21 విమానాల పదవీ విరమణ తర్వాత భారత వైమానిక దళం యొక్క స్క్వాడ్రన్ సంఖ్య 29కి తగ్గే అవకాశం ఉంది. మిగ్-21 విమానాల స్థానంలో స్వదేశీ తేజస్ విమానాలు వస్తాయి. 2021ఫిబ్రవరిలో, వైమానిక దళం రూ. 48,000 కోట్ల విలువైన 83 తేజస్ Mk-1A విమానాల కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని తర్వాత ఇటీవల రూ.62,370 కోట్ల విలువైన 97 తేజస్ Mk-1A యుద్ధ విమానాల కోసం ఒప్పందం కుదిరింది.

Advertisment
తాజా కథనాలు