BIG BREAKING  : రిపబ్లిక్‌డే రోజున ఇండియాలో భారీ పేలుళ్లకు కుట్ర!

ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన కేసు విచారణలో కీలక అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన కీలక సూత్రధారులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ, ఉమర్ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు.

New Update
blast

ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన కేసు విచారణలో కీలక అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. అరెస్టయిన కీలక సూత్రధారులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ, ఉమర్ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టారు. 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవంతో పాటుగా దీపావళి పండుగల సమయంలో ఢిల్లీలో భారీ బ్లాస్ట్ లకు ప్లాన్ చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ ప్లాన్ ద్వారా దేశంలో అలజడి సృష్టించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. తమ ముఠా సభ్యులు వివిధ ప్రదేశాల్లో పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్,  మందుగుండు సామగ్రిని నిల్వ చేసినట్లుగా విచారణలో వెల్లడించారు.ఢిల్లీ శివార్లలో ఓ సిక్రెట్ ఏరియాలో కూడా బ్లాస్ట్ నిర్వహించినట్లుగా అంగీకరించారు. గత ఆరు నెలల్లో చాలా సార్లు ఎర్రకోట ప్రాంతాన్ని రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తు సంస్థల ముందు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు