Satyendar Jain : మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు ఈడీ బిగ్ షాక్

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ కు సంబంధించిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2015 ఫిబ్రవరి, 2017 మే మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈ మనీలాండరింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.

New Update
jain

ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌కు బిగ్ షాక్‌ తగిలింది. ఆయనకు సంబంధించిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న సమయంలో జైన్ 2015 ఫిబ్రవరి, 2017 మే మధ్య ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ 2017లో సీబీఐ దాఖలు చేసిన కేసు ఆధారంగా ఈ మనీలాండరింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టింది.  ఆస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అటాచ్ చేశారు.

గతంలో ఈడీ 2022లో జైన్‌కు సంబంధించిన రూ. 4.81 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. తాజాగా చేసిన జప్తుతో కలిపి, మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ. 12.25 కోట్లకు చేరింది. ఈడీ ఆరోపణల ప్రకారం, 2016 నవంబర్ నోట్ల రద్దు తర్వాత, సత్యేందర్ జైన్‌కు సన్నిహితులైన అంకుష్ జైన్, వైభవ్ జైన్ అనే వ్యక్తులు ఆదాయ వెల్లడి పథకం (IDS), 2016 కిందరూ. 7.44 కోట్లు నగదును బ్యాంక్ ఆఫ్ బరోడాలో అడ్వాన్స్ ట్యాక్స్‌గా జమ చేశారు.

బినామీలుగా వ్యవహరించారని

అయితే ఈ వ్యక్తులు జైన్ కోసం బినామీలుగా వ్యవహరించారని ఆదాయపు పన్ను శాఖ, ఢిల్లీ హైకోర్టు నిర్ధారించాయి. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈడీ ఈ కేసులో దర్యాప్తును కొనసాగిస్తోంది.  త్వరలో ఒక అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా సత్యేందర్ జైన్‌ నాలుగు షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారనే అభియోగంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2022 మే 30న అరెస్టు చేసింది. రెండేళ్ల ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisment
తాజా కథనాలు