NEET UG 2025: నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల ముసలవ్వ.. చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించింది
కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి 72ఏళ్ల వయస్సులో నీట్ పరీక్ష రాసింది. ఆదివారం ఈ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆమె వచ్చారు. పరీక్ష సమయంలో తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్‌టికెట్‌ను చూపించారు.