/rtv/media/media_files/2025/05/17/jMmEdsRywrEeJNrJ8W6t.jpg)
neet results
మద్రాస్ హైకోర్టు సంచలనం నిర్ణయం తీసుకుంది. నీట్ ఫలితాలను విడుదల చేయవద్దని అధికారులను ఆదేశించింది. చెన్నైలోని అవడిలోని ఒక పరీక్ష కేంద్రంలో విద్యుత్తు అంతరాయం కారణంగా పరీక్ష పూర్తి చేయలేకపోయిన అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. మే 4న జరిగిన పరీక్ష సమయంలో ఏర్పడిన అంతరాయం కారణంగా దాదాపు 45 నిమిషాల పాటు పరీక్ష అగిపోయింది. పరీక్ష మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రారంభం కాగా భారీ వర్షం కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.15 గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది.
In a petition seeking re-exam for NEET candidates affected by power cuts, the Madras High Court has ordered a stay on the release of NEET exam results. pic.twitter.com/OdyR37XQws
— Tamil Nadu Newsit (@Newsit_TNadu) May 17, 2025
Also Read : యుద్ధంలో పాకిస్థాన్‌తో ఆడుకున్న ఆకాశ్‌తీర్ గురించి తెలుసా ?
Also Read : సెలబ్రిటీలు దేశ భక్తులు కాదు.. పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్!
అదనపు సమయం కేటాయించాలని కోరగా
దీంతో పరీక్ష రాసేందుకు అభ్యర్థులకు ఆలస్యమైంది. దీంతో అభ్యర్థులు పరీక్షా కేంద్ర అధికారులను అదనపు సమయం కేటాయించాలని కోరగా అందుకు వారు నిరాకరించారు. చాలా మంది విద్యార్థుల కల అయిన MBBS ప్రవేశ పరీక్షలో ఒక చిన్న లోపం కూడా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని అభ్యర్థులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టి... ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ పరీక్షా సంస్థ (NTA) తమ ప్రతిస్పందనలను సమర్పించే వరకు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 02వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.
Also Read : తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 80 కంపెనీల్లో 5 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!
Also Read : కమల్ - శింబు ఫేస్ ఆఫ్.. మణిరత్నం గ్యాంగ్ స్టార్ డ్రామా 'థగ్ లైఫ్' ట్రైలర్
telugu-news | neet-exam | tamil-nadu | NEET Results