Karnataka: నీట్ రద్దుకు తీర్మానం..కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం కర్ణాటకలో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను రద్దు చేసేవిధంగా ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీట్ స్థానంలో మరో ఎంట్రన్స్ పరీక్ష జరపాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. By Manogna alamuru 23 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి NEET Exam Cancel: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా డాక్టర్ కోర్స్ ప్రవేశాల కోసం జరిపే నీట్ ఎగ్జామ్స్‌ను రద్దు చేయాలని సిద్ధ రామయ్య ప్రభుత్వం తీర్మానించింది. దీనికి కేబినెట్ ఆమోదం కూా తెలిపింది. నీట్ స్థానంలో మరో మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం లేదా, కామన్ ఎంట్రన్ టెస్ట్ తో పరీక్ష జరపాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో సమాేశమైన మంత్రి వర్గం ఈ నిర్యం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లు కర్ణాటక విధాన సభ ముందుకు త్వరలోనే రానుంది. గతంలో లాగానే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా, సొంతంగా ప్రవేశాలు చేపట్టేలా రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రీసెంట్గా నీట్ పరీక్షలో అక్రాలు, ఫలితాల్లో అవకతవకలు దేశం మత్తంలో కల్లోల రేపాయి. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. తాజాగా గ్రేస్ మార్కులు వేసిన పలువురికి రీ ఎగ్జామ్ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ రద్దు తీర్మానం చేసిందని తెలుస్తోంది. మెడికల్ ప్రవేశాల కోసం కొత్తగా తీసుకొచ్చిన బిల్లు అసెంబ్లీలో పాస్ అయితే యూజీ, పీజీ కోర్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పరీక్ష పెట్టే అవకాశం ఉంది. గత నెల తమిళనాడు ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు సొంతంగా వైద్యవిద్యలో ప్రవేశాలు కల్పించేందుకు అనుమతిఇవ్వాలని పేర్కొంది. దీనికి పలు స్థానిక పార్టీలు మద్దతు ఇచ్చాయి. Also Read:Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్…విశేషాలు ఇవే #neet-exam #congress-government #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి