ఆస్తి ఇవ్వనన్న తండ్రి.. ఇంటి నుంచి రూ.కోటి కాజేసిన కొడుకు
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చెడు సావాసాలకు అలవాటు పడ్డ కొడుకును తండ్రి మందలించాడు. అతడిని ఇంట్లో నుంచి వెళ్లగొడతానని, ఆస్తి ఇవ్వనని హెచ్చరించాడు. దీంతో కొడుకు తన స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే రూ.కోటి కాజేశాడు.