Flights: ఎయిర్‌పోర్టుల్లో సమ్మే.. 3400 విమానాలు రద్దు..

జర్మనీలోని ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. 3400 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌ అసోసియేషన్ అంచనా వేసింది.

New Update
One-day strike at 13 German airports brings most flights to a halt

One-day strike at 13 German airports brings most flights to a halt

జర్మనీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనివల్ల  మ్యూనిక్, ఫ్రాంక్‌ఫర్ట్‌తో పాటు ప్రధాన నగరాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులపై ఎఫెక్ట్‌ చూపించింది. వేలాది విమాన సర్వీసులు రద్దయిపోయాయి. మొత్తంగా 5 లక్షల మంది ప్రయాణికులపై ఈ ప్రభావం పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్‌ షాక్.. రావడం కష్టమే

ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానశ్రయం నుంచి 1116 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇందులో 1054 సర్వీసులు రద్దయినట్లు అక్కడి స్థానిక మీడియా చెప్పింది. బెర్లిన్ నుంచి నడిపే విమానాలన్నీ కూడా రద్దయిపోయినట్లు పేర్కొంది. మిగతా ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మొత్తంగా సమ్మే వల్ల జర్మనీలో 3400 విమాన సర్వీసులు పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని జర్మనీ ఎయిర్‌పోర్టు ఆపరేటర్స్‌ అసోసియేషన్ అంచనా వేసింది. 

Also Read: దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో సోదాలు.. భారీగా అక్రమాలు?

ఓవైపు తమకు వేతనాలు పెంచాలని ఎయిర్‌పోర్టులో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పని ప్రదేశంలో అదనపు సమయం కోసం ఎక్కువగా బోనస్ ఇవ్వాలని అందులో పనిచేసే సిబ్బంది, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కానీ వాళ్ల డిమాండ్లు పరిష్కరించలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, కార్మిక సంఘాలు ఒకరోజు సమ్మేకు దిగాయి. అయితే మార్చి చివర్లో మరోసారి చర్చలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు