/rtv/media/media_files/2025/03/07/y4AEzfcLzENqvdAItsSU.jpg)
PM Modi
ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన 'ముద్రా' యోజన పథకం కింద రూ.32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. సున్నా సీట్లు వచ్చినవాళ్లకి ఇందులో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా లెక్కించలేరని కాంగ్రెస్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. '' ముద్రా స్కీమ్ కింద పేదలకు ఇప్పటిదాక రూ.32 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాం.
Also Read: బంగారు కిలాడీ.. అతనికోసమే గల్ఫ్ దేశాలన్నీ చుట్టేసి గోల్డ్ రవాణా!
మమ్మల్ని దుషించేవాళ్లు సున్నా సీట్లు ఉన్నవారు. రూ.32 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలు ఎక్కడ ఉన్నాయో లెక్కించలేరని'' ప్రధాని మోదీ అన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఆహార భద్రత సంతృప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని ఇలా స్పందించారు. అలాగే దేశంలో ఐదుకోట్ల ఫేక్ రేషన్ కార్డును ఏరివేశామని.. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థను క్రమబద్దీకరించినట్ల పేర్కొన్నారు.
Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
సూరత్‌లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఆహార భద్రతా లక్ష్యాలు సాధించడం కోసం అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అంతేకాదు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణను మహిళలకే అప్పగిస్తానని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్రం 2015లో ప్రారంభించింది.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
Also Read: సామాజిక కార్యకర్తను చంపిన భార్య, అత్త.. కంపెనీ వెబ్‌సైట్‌లో సూసైడ్ నోట్ సంచలనం!