PM Modi: ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

New Update
Narendra Modi

Narendra Modi

ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని.. త్వరగా కోలుకోవాలంటూ రాసుకొచ్చారు.  

Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీ‌షీటర్

ఇదిలాఉండగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు జగదీప్‌ ధన్‌ఖడ్‌కు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం జగదీప్‌ను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (CCU)లో ఉంచారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. 

Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన యూపీ పోలీసులు!

జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆస్పత్రిలో చేరిన వార్తలు రావడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఎయిమ్స్‌కు వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇక ఆదివారం ఉదయమే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేడీ నడ్డా ఆస్పత్రికి వెళ్లారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

Also Read: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?

Also Read: లిప్‌స్టిక్‌తోపాటు కత్తీ, కారం పొడి తీసుకెళ్లండి.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు