/rtv/media/media_files/2025/03/08/4OYNeWrwYdJRX38GdmIN.jpg)
Lalit Modi Surrenders Indian Passport, Acquires Citizenship Of Vanuatu
ఐపీఎల్ వ్యవస్థాపకుడు ఎవరు అంటే అందరికీ గుర్తుకువచ్చేది లలిత్ మోదీ. 2008లో ఆయన ప్రారంభించిన ఐపీఎల్ ఇప్పుడు ఎంతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కానీ దాని వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మాత్రం అక్రమాలకు పాల్పడి లండన్ పారిపోయాడు. తాజాగా ఆయన పసిఫిక్ ద్వీప దేశమైన వనువాటు పౌరసత్వం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. లలిత్ మోదీ ఐపీఎల్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో 2010లో అతడు లండన్‌కు పారిపోయాడు. 2008 నుంచి 2010 వరకు మూడుసార్లు ఐపీఎల్‌ను నిర్వహించిన లలిత్ మోదీ.. ఇలా అక్రమాలకు పాల్పడి లండన్‌కు వెళ్లిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ సమయంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. దీంతో ఆయన ఢిల్లీ హైకోర్టులో కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేశారు. చివరికి 2014లో ఆయన పాస్‌పోర్టును హైకోర్టు పునరుద్ధరించింది. అయితే ఆయన అప్పటినుంచి లండన్‌లోనే ఉంటున్నారు.
Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!
కేసులు కొనసాగుతాయి
ఇటీవల తన పాస్‌పోర్టును లండన్‌లో ఉన్న భారత హై కమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని లిలిత్ దరఖాస్తు చేసుకున్నాడు. దీనికన్నా ముందు ఆయన సంపన్నులు తీసుకునే వానువాటు గోల్డెన్ పాస్‌పోర్టు కార్యక్రమం కింద పౌరసత్వాన్ని పొందాడు. భారత్‌లో ఆయనపై ఉన్న కేసు, దర్యాప్తుల నుంచి తప్పించుకునేందుకే ఈ పౌరసత్వం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా స్పందించారు. లలిత్ మోదీ దరఖాస్తును పరిశీలిస్తామని తెలిపారు. ఆయన వనువాటు పౌరసత్వం పొందినట్లు తెలిసిందని.. అయినప్పటికీ కూడా లలిత్‌పై చట్ట ప్రకారమే కేసులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
నో ట్యాక్స్
ఇప్పుడు చాలామంది వనువాటు దేశం గురించి తెలుసుకునేందుకు తెగ ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. అయితే ఆస్ట్రియన్ ఇమిగ్రెంట్ ఇన్వెస్ట్ కార్యాలయ అధిపతి జ్లాటా ఎర్లాచ్ వనువాటు పౌరసత్వం తీసుకుంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు వివరించారు. '' ఆ దేశంలో ఉంటే స్థానికంగా, అంతర్జాతీయంగా వచ్చే ఆదాయంతో సంబంధమే లేకుండా దేనిపై కూడా అక్కడ ఇన్‌కమ్ ట్యాక్స్ ఉండదు. వారసత్వ, కార్పొరేట్ పన్ను లేదు. వనువాటులో వ్యాపార సంస్థను నమోదు చేసుకుని విదేశాల్లో ఉండి సంపాందించుకున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
Also Read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!
దీర్ఘకాలిక లాభాలతో పాటు స్టాక్స్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా ఎంత సంపాదించినా కూడా వాటిపై ఎలాంటి పన్నులు ఉండవు. అలాగే వనువాటు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే 2024 హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో వనువాటు మొదటి స్థానంలో చోటు సంపాదించింది.
పౌరసత్వం పొందాలంటే
వనువాటు అనేది దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ఓ ద్వీప దేశం. ఇక్కడి జనాభా కేవలం 3.2 లక్షలు మాత్రమే. దీని రాజధాని పోర్ట్ విలా. బిస్లామా, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషలు అక్కడ మాట్లాడుతారు. ఇక్కడ 82 శాతం క్రిస్టియన్ మతస్థులే ఉన్నారు. అయితే వనువాటు పౌరసత్వం పొందడం అంత సులభం కాదు. ఎవరు పడితే వాళ్లు ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేరు. అక్కడ పౌరసత్వం పొందాలంటే సిటిజెన్‌షిప్ బై ఇన్‌వెస్ట్‌మెంట్ (CBI) అనే ప్రొగ్రామ్ ద్వారా అక్కడి స్థానిక అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టుబడుల ద్వారా ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది.
ఒక్కరు వెళ్లాలనుకుంటే లక్షా ముప్పై వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.కోటి) సాయం చేయాలి. లేదా వనువాటు దేశానికి చెందిన వాళ్లని పెళ్లి చేసుకున్నా కూడా ఆ దేశ పౌరసత్వాన్ని పొందవచ్చు. దంపతులు అయితే 150,000 డాలర్లు (రూ.కోటీ 30 లక్షలు) ఇవ్వాలి. ఇక కుటుంబం మొత్తం అయితే 180,000 డాలర్లు( రూ.కోటీ 56 లక్షలు) ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. లేదా వనువాటు దేశానికి చెందిన వాళ్లని పెళ్లి చేసుకున్నా కూడా ఆ దేశ పౌరసత్వాన్ని పొందవచ్చు.