Rahul Gandhi: సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ రాహుల్‌ గాంధీ

గుజరాత్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సగం మంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీతోనే చేతులు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు.

New Update
Rahul Gandhi

Rahul Gandhi

విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సొంత పార్టీ నేతలపైనే ఫైర్ అయ్యారు. తమవాళ్లు బీజేపీతో చేతులు కలిపి వాళ్లకు బీటీమ్‌గా పనిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో సగం మంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీతోనే చేతులు కలిపారని అన్నారు. వాళ్లు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. 

Also Read: తల్లి ప్రేమకు అవధుల్లేవు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

ఇలా బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్న వాళ్లని ఎవరినీ వదిలిపెట్టమని.. అలాంటి వాళ్లందరినీ బయటకు పంపించేస్తామని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ నేతలకు కొదవ లేదంటూ వ్యాఖ్యానించారు. '' తెలంగాణలో కాంగ్రెస్‌కు 22 శాతం ఓట్లు పెరిగాయి. అసాధ్యం అనుకున్న చోటే వాళ్లు సాధించి చూపించారు. గుజరాత్‌లో ఇప్పటికీ కాంగ్రెస్‌కు 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. కానీ కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ ప్రతిష్టను రోజురోజుకు దిగజార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. 

Also Read: రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగవు!

పార్టీలో ఉన్నవాళ్లందరూ లైన్‌లో ఉండి పనిచేయాలి. ఎవరైనా గీత దాటితే వాళ్లపై వేటు వేసేందుకు ఎంతో సమయం పట్టదు. ఇప్పుడైన మించిపోయింది ఏమీ లేదు. వాళ్లు తమ వైఖరిని మార్చుకొని పార్టీ కోసం పనిచేయాలని'' రాహుల్‌ గాంధీ అన్నారు. అయితే సొంత పార్టీ నేతలపైనే రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుజరాత్‌లో కొందరు కాంగ్రెస్‌ నేతలు బీజేపీ వైపు పనిచేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాహుల్‌ గాంధీ వాళ్లని ఉద్దేశిస్తూ ఇలా హెచ్చరించారు. 

Also Read: సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..!

Also Read: ఆ భాషలోనూ విద్యనందించాలని.. తమిళనాడు సీఎంకి అమిత్ షా విజ్ఞప్తి

Advertisment
తాజా కథనాలు