/rtv/media/media_files/2025/03/07/iSZv6fZiMe8WRkMFfrVe.jpg)
CM Revanth Reddy Responds on Delimitation
ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోందని విమర్శలు చేశారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే డీలిమిటేషన్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: మేఘాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు?
ఈ తరణంలోనే ఇండియా టుడే నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌పై స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. '' దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి సరైన ప్రాతినిధ్యం లేదు. ముడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 240 సీట్లు వస్తే.. అందులో దక్షిణాదిలో 29 స్థానాల్లోనే గెలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకుంటే ఆ పార్టీ ఎక్కడ కూడా అధికారంలో లేదు. అందుకే డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
Also Read: ఆస్తికోసం సొంత అన్న.. అన్న కొడుకు మర్డర్ కు తమ్ముడు స్కెచ్... పోలీసుల ఎంట్రీతో...
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను చేపట్టాయి. మరో 30 ఏళ్లు డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి. అప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా ఎలా పెరుగుతుందో చూడండి. డీలిమిటేషన్ వల్ల కేవలం దక్షిణాది రాష్ట్రాలకే కాదని పంజాబ్ వంటి రాష్ట్రాలకు కూడా నష్టం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు లబ్ధి జరుగుతుందని'' సీఎం రేవంత్ అన్నారు.
Also Read: రేవంత్, కేసీఆర్‌కు స్టాలిన్ సంచలన లేఖ.. ఎందుకో తెలుసా ?