Nalgonda Maoist : ఒడిశా ఎన్‌ కౌంటర్‌..పాకా హనుమంత్‌  నేపథ్యమిదే...

ఒడిశాలోని కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే ఉన్నారు.

New Update
FotoJet (4)

Paka Hanumanth

Nalgonda Maoist : ఒడిశాలోని కందమాల్‌ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు కూడా ఉందని తెలిపారు. కాగా హనుమంతు స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం.గణేశ్‌ గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన మావోయిస్టుల బలం పెంచడం కోసం ఎంతో కృషిచేశారు.

FotoJet (3)

నాలుగు దశాబ్ధాల అజ్ఞాత జీవితం..

పాక చంద్రయ్య, పాపమ్మ దంపతుల ఆరుగురు సంతానంలో హనుమంతు (గణేష్) మొదటివారు. ఆయన 1961లో జన్మించారు. హనుమంతుకు ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందరికంటే పెద్దవాడైన హనుమంతు చండూరులో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ నల్గొండలో చేస్తూ రాడికల్ యూనియన్‌లో పనిచేశారు. 45 ఏళ్ల క్రితం ఏచూరి శ్రీనివాస్ అనే ఏబీవీపీ నాయకుని హత్యలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన నక్సలైట్‌ ఉద్యమంలో చేరారు. అప్పటినుంచి ఆయన తిరిగి ఇంటివైపు చూడలేదు. ఆయన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా రాలేదు. మండల కమిటీ నుంచి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి నేతగా ఎదిగి మూడు రాష్ట్రాలకు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఇటీవలి కాలంగా ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పడుతున్నారని సమాచారం.
పాక హనుమంతు చిన్నప్పటినుంచే కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉన్నారని ఆయన సోదరుడు తెలిపారు. హనుమంతు తండ్రి సీపీఎం పార్టీలో పనిచేశారు. దీంతో హనుమంత్‌ చదువుకునే రోజుల్లోనే ఉద్యమం వైపు వెళ్లారు.   


గతంలోనే చనిపోయాడని..

కాగా, గతంలో  ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పాక హనుమంతు మృతి చెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించడం గమనార్హం. ఆ సమయంలో  గ్రామంలో విషాదం నెలకొంది. 45 సంవత్సరాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఈ 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. అయితే నాడు చనిపోయింది హనుమంతు కాదని కుటుంబ సభ్యులు , పార్టీ నాయకత్వం ప్రకటించింది. కాగా తాజాగా ఆయన ఒడిస్సాలో మరణించినట్లు పోలీసులు దృవీకరించారు.
 

Advertisment
తాజా కథనాలు