Bihar: పార్కింగ్ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!
దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
నాలుగేళ్ళ కొడుకు హత్య చేసిన కేసులో అరెస్టైన మైండ్‌ఫుల్ ఏఐ సంస్థ సీఈవో సుచనా సేథ్ గురించి రోజుకో వార్త వస్తోంది. తాజాగా ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని చెబుతున్నారు. ఎప్పటికీ కొడుకు తనకే దక్కాలంటూ మృత దేహం దగ్గర లేఖ రాసి పెట్టిందని పోలీసులు చెబుతున్నారు.
మాజీ మావోయిస్టు భీమన్న అలియాస్ రాము దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూల్ జిల్లాకు చెందిన అతన్ని గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి రాళ్లతో కొట్టి చంపేశారు. మృతుడికి కొంతకాలంగా మతి స్థిమితం లేదని, అతను ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
2018లో 8 నెలల గర్భిణిని అత్యంత దారుణంగా చంపి ఎనిమిది ముక్కలు చేసిన కేసులో నలుగురు నిందితులకు కూకట్పల్లి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 65 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం.. డీఎన్ఏ, ఇతర ఆధారాలతో తుది తీర్పు వెల్లడించింది.
గురుగ్రామ్ లోని ఓ హోటల్ లో మాజీ మోడల్ దివ్య పహుజాను ఆ హోటల్ యజమాని అభిజిత్ మరో వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహన్ని దుప్పటిలో చుట్టి అక్కడ నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. దీని ఆధారంగా పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.
ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అఫ్సానా అనే మహిళ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని రెండేళ్ల బిడ్డని గొంతు నులిమి చంపేసింది.
పచ్చని కాపురంలో అనుమానం పెనుభూతమై రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఏపీలోని గుడివాడలో భర్త తన భార్యను అతి దారుణంగా 12 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై తాను కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు.
ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అనుమానంతో అత్యంత దారుణంగా చంపిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన నందిని 25, వెట్రిమారన్ 26 కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నందిని మరో అబ్బాయితో క్లోజ్ ఉంటుందనే కోపంతో వెట్రిమారన్ ఆమెను గొలుసుతో కట్టేసి, బ్లేడుతో కోసి చంపాడు.
నిజామాబాద్ జిల్లాలో సంచలనం రేపిన ఆరు హత్య కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వెచ్చింది. సోదరుడితోపాటు మరో ముగ్గురి సహాకారంతో హత్యలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ లభించలేదని..సుశీల బతికే ఉందా? చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.