దేశంలో రోజుకు 78 హత్యలు.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు..
దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 78 హత్యలు జరిగాయి. 2021లో 29,272 హత్య కేసులు నమోదయ్యాయి. అంటే 2021 కంటే 2022లో 2.6 శాతం హత్య కేసులు తగ్గాయి. వివాదాలు, ప్రతికారాలు, శతృత్వం ఈ హత్యలకు ప్రధాన కారణాలు.