Trainee Doctor Rape, Murder Case: ఆర్జీకర్ ఆసుపత్రి ప్రవర్తన, ట్రైనీ డాక్టర్ చనిపోయినప్పుడు అక్కడి వారి స్పందన మొదటి నుంచీ అనుమానంగానే ఉన్నాయి. ప్రిన్సిపాల్ నుంచి ఆసుపత్రి సిబ్బంది వరకు అందరూ కలిసి కట్టుగా రేప, హత్యను పక్క దోవ పట్టించడానికి చూశారనే తెలుస్తోంది. దానికి తోడు తాజాగా బయటపడిన కాల్ రికార్డ్‌ను వాటిని మరింత బలపరుస్తున్నాయి. ట్రైనీ డాక్టర్ చనిపోయిందని చెప్పడానికి ఫోన్ చేసిన సిబ్బంది మూడు సార్లు మూడు రకాలుగా మాట్లాడారు. వాస్తవాలను దాచేందుకు ప్రయత్నించారు. తమ కుమార్తెకు ఏమైందని అడిగిన ప్రశ్నకు.. జ్వరం వచ్చిందని ఓసారి, ఆత్మహత్య చేసుకుందని మరోసారి.. ఇలా చెప్పారు. తీరా తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి కనిపించింది.
పూర్తిగా చదవండి..Kolkata: మూడుసార్లు ఫోన్లు..మూడు రకాల సమాధానాలు..ఆర్జీకర్ ఆసుపత్రి తీరులో అనుమానాలు
ట్రైనీ డాక్టర్ రేప్,హత్య జరిగిన తీరు,ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన అన్నీ అనుమానాలే.విద్యార్ధిని హత్యకు గురైందన్న విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆసుపత్రి సిబ్బంది మూడు సార్లు మూడు రకాలుగా సమాధానాలు చెప్పారు.తాజాగా బయటపడిన కాల్ రికార్డ్‌లో స్పష్టంగా తెలుస్తోంది.
Translate this News: