Hyderabad: ప్రేమోన్మది దాడిలో మరో యువతి బలి!

హైదరాబాద్‌ లోని గచ్చిబౌలిలో దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది దాడిలో దీపన తమాంగ్‌ (25) అనే యువతి దారుణ హత్యకు గురైంది. మరో ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తరువాత నిందితుడు రాకేశ్‌ కూడా ఆత్మహత్యాయత్నానికిప్రయత్నించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Telangana: మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో తల్లి, కుమారుడు దారుణ హత్య..

Hyderabad: హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గోపన్‌ పల్లి తండాలో ప్రేమోన్మాది దాడిలో యువతి దీపన తమాంగ్‌ (25) మృతి చెందగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బుధవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..కర్ణాటకలోని బీదర్‌ కు చెందిన రాకేశ్‌..మాదాపూర్‌ లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌ లో ఉంటున్నాడు.

పశ్చిమబెంగాల్‌ కు చెందిన దీపన తమాంగ్‌ నల్లగుండ్లలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఆమెఉ గోపన్‌పల్లి తండా సమీపంలో స్నేహితులతో కలిసి ఉంటుంది. కొంతకాలంగా రాకేశ్‌ తో ఆమెకు పరిచయం ఉంది. గతేడాది నుంచి ఆమెను పెళ్లి చేసుకోవాలని రాకేశ్‌ వెంటపడి వేధిస్తున్నాడు. దానికి దీపన నిరాకరించింది.

బుధవారం రాత్రి ఆమె ఇంటికి రాకేశ్‌ వెళ్లాడు. ఆవేశంగా అక్కడే ఉన్న కూరగాయల కత్తితో ఆమె మీద దాడికి దిగాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన దీపన మృతి చెందింది. దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకోవడానికి యత్నించిన మరో ముగ్గురు యువతుల మీద రాకేశ్‌ దాడికి దిగాడు. ఆ తరువాత రాకేశ్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు.

విద్యుత్‌ స్తంభం ఎక్కేందుకు యత్నించడంతో షాక్‌ తో గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు రాకేశ్‌ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.

Also Read: తెలుగు జాతి తియ్యదనం…తెలుగు భాష గొప్పదనం..!

Advertisment
తాజా కథనాలు