దారుణం.. ఉరేసి, గొంతు కోసి ఆర్‌ఎంపీ డాక్టర్ భార్య హత్య

హైదరాబాద్‌లో RMP డాక్టర్‌‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు భార్య దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొందరు దుండగులు ఆమెను స్టెతస్కోప్‌తో ఉరేసి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

New Update

హైదరాబాద్‌లో అమీర్‌పేట్‌లో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలో RMP డాక్టర్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు కుటుంబంతో కలిసి అమీర్‌పేటలో ఉంటున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో RMP డాక్టర్‌ భార్యను కొందరు దుండగులు కిరాతకంగా చంపేశారు. స్టెతస్కోప్‌తో ఉరేసి, కత్తితో గొంతు కోసి దారుణంగా ఆమెను హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ తగాదాలు, వ్యక్తిగత సమస్యల వల్ల ఎవరైనా ఇలా చేశారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: రుణమాఫీ కాలేదని.. మనస్తాపంతో రైతు ఆత్మహత్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు