Khammam : ఆస్తి కోసం.. తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య!
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించింది. అంత్యక్రయల తర్వాత అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీ గార్డుపై జరిగిన హత్య ఘటనతో ఆళ్లగడ్డ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నలుగురికి మించి ఎక్కడా గుంపులుగా ఉండొద్దు అంటూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఏటూరు నాగారంకు చెందిన అంగన్వాడీ టీచర్ సుజాత దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఆమెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. మెడకు స్కార్ఫ్ బిగించి చంపి, ఆమె వేసుకున్న నాలుగు తులాల బంగారంతో పాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ తనపై జరిగిన హత్యాయత్నంపై స్పందించాడు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డిలే తనపై దాడిచేసినట్లు తెలిపాడు. ప్లాన్ ప్రకారమే తనను హతమార్చేందుకు ప్రయత్నించారన్నాడు. గతేడాది లోకేశ్ యువగళం పాదయాత్రలో జరిగిన గొడవే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో వాట్సాప్ గ్రూప్‌లోని కొన్ని మెసేజ్‌ల వల్ల మొదలైన వివాదం.. ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వెళ్లింది. ఓ ఫ్యామిలీ గ్రూప్‌లో బంధువుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో అస్లాం అనే వ్యక్తి తన బంధువైన సల్మాన్ అన్సారీని కత్తితో పొడిచి చంపేశాడు.
శ్రీకాకులం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాం గ్రామంలో బయట నిద్రిస్తున్న సంగాం అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేయడం కలకలం రేపింది. దీన్ని రాజకీయ హత్యగా మృతుడి బంధువులు అనుమానిస్తున్నారు. సంగాం టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మధురానగర్‌లో దారుణ హత్య జరిగింది. రవికుమార్ అనే అనే వ్యక్తిని ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు తలపై రాడ్డుతో కొట్టి చంపాడు. నిందితుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు.
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురై నవ్‌జీత్ సంధు అనే ఓ భారత విద్యార్థి మృతి చెందారు. ఇంటి అద్దె విషయంలో భారత విద్యార్థుల మధ్య గొడవ జరగగా.. వారిని ఆపేందుకు నవ్‌జీత్ ప్రయత్నించాడు. ఈ ఘర్షణలో అతడి ఛాతిలోకి కత్తి దూసుకెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు.