Medchal Murder: మేడ్చల్ మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్

మేడ్చల్ ఓఆర్ఆర్ కల్వర్ట్ కింద యువతిని దారుణంగా హత్య చేసిన ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మృతదేహం పక్కన పసుపు, కుంకుమ ఆనవాళ్ళు కనిపించడంతో...క్షుద్రపూజలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

New Update
TS

Medchal Young Woman Murder

 మేడ్చల్ లో యువతి  మర్డర్ పోలీసులకు సవాల్ గా మారింది. హత్య జరిగి 24 గంటలు గడిచినా ఒక్క ఆధారం కూడా లభించలేదు. నిందితులు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరక్కుండా చాలా పక్కాగా పలాన్ చేసి మరీ ర్డర్ చేశారు. దానికి తోడు బాడీని తగులబెట్టడం వల్ల కూడా ఆనవాళ్ళు లభించడం లేదు. పైగా సీసీ కెమెరాలు లేని ప్రదేశంలో హత్య చేశారు. అయితే ఒంటిపై ఉన్న పూసలదండ, జడ పిన్నీసులు మాత్రం ఏపీలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మహిళలు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. దాని ద్వారా ఆ మహిళ ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీసీఎస్‌ పోలీసులు, ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..

క్షుద్రపూజలు చేశారేమో..

మరోవైపు యువతి మర్డర్ కు సంబంధించి మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యువతి శరీరం క్కన పసుపు, కుంకుమను పోలీసులు గుర్తించారు.  దీంతో క్షుద్రపూజలు చేసి అమ్మాయిని చంపేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటూ తెలంగాణతో పాటూ ఇతర ప్రాంతాల్లో మిస్సింగ్ కేసులను పరిశీలిస్తున్నారు. 

ఓఆర్ఆర్ కాజ్ వే కింద ఆమెను పడేసిన రెండు గంటల తర్వాత మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందించారు. యువతి ఎవరో గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆమె మొహం మీద దుండగులు చితకబాదారు. కొంచెం కూడా ఆనవాళ్ళు కనిపించడం లేదు. దానికి తోడు ఆమెను కాల్చి పడేశారు. అది కూడా చాలా వికృతంగా చేశారని తెలుస్తోంది. పెట్రోల్ లేదా కిరసనాయిల్ తో మృతదేహాన్ని కాల్చడం కాకుండా చిన్న లైటర్ తో ఆమె ముఖాన్ని కాల్చారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యువతిని దుండగులు రేప్ చేసి చంపారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆమె ప్రవైటు పార్ట్ దగ్గర బట్టలు సరిగ్గా లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. 

Also Read: చెన్నై ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు..హై టెన్షన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు