HYD: ఓ భర్త, ఇద్దరు ప్రియులు.. నార్సింగి జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్

హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వివాహిత బిందు, సాకేత్ హత్యలకు కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బిందు రెండో ప్రియుడు హతమార్చినట్లు గుర్తించారు. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.  

New Update
hyderabad murder

Narsingi Puppalaguda Lovers murder case

Murder: హైదరాబాద్ నార్సింగి జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వివాహిత బిందు, సాకేత్ హత్యలకు కారణం అక్రమ సంబంధమేనని పోలీసులు నిర్ధారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బిందు రెండో ప్రియుడు వీరిద్దరిని హతమార్చినట్లు గుర్తించారు. ఆమెకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు.  

భర్త ఉండగానే మరో ఇద్దరితో.. 

అయితే ఇప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన బిందు.. సాకేత్‌తో ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ క్రమంలోనే మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది. కొద్ది రోజులకు బిందు, సాకేత్‌ విషయం తెలుసుకున్న రెండో ప్రియుడు వారిపై కన్నేశాడు. అయితే ఏకాంతంగా గడిపేందుకు ఈనెల 12న బిందు, సాకెత్ పుప్పాలగూడ గుట్టకు వెళ్లారు. విషయం తెలుసుకుని ఇద్దరిని ఫాలో అయిన బిందు రెండో ప్రియుడు.. కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోది హత్య ఇద్దరిని చంపేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Ind Vs ire: వన్డే చరిత్రలో సరికొత్త రికార్డు.. ఐర్లాండ్‌పై సెంచరీల మోత

ఇక జనవరి 3న బిందు అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. సాకేత్‌పై కూడా జనవరి 8న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ క్రమంలో గాలిస్తున్న పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా మంగళవారం హత్యకు గురైనట్లు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: 4రోజుల్లో కూతురి పెళ్లి.. పోలీసుల ముందే కాల్చి చంపిన తండ్రి

Advertisment
తాజా కథనాలు