బీజేపీ MLAలతో మోదీ కీలక భేటీ | Telangana BJP MLA'S Meet PM Modi | MLA Raja Singh | RTV
ప్రతీ పబ్‌లోనూ పెద్దెత్తున డ్రగ్స్ సప్లయ్ అవుతున్నాయి.వాటి నుంచి యువతను కాపాడుకోవడం మన బాధ్యత అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి క్రైమ్‌ను ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారో దృష్టి పెట్టండని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన రిక్వెస్ట్ చేశారు.
TG: తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తనను చంపేస్తామంటూ పలు నెంబర్ల నుంచి గుర్తు తెలియాలని వ్యక్తులు కాల్ చేసి బెదిరిస్తునట్లు చెప్పారు. ఇలా కాల్స్ రావడం ఇది మొదటి సారి కాదని.. ఇది వరకు ఇలా అనేక కాల్స్ వచ్చాయని తెలిపారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది . ఇటీవల ఖానాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న రాజాసింగ్ ను హౌజ్ అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను చూపిస్తుందన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆయన చెంగిచెర్ల వెళతానని ప్రకటించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హోళీ రోజు చెంగిచెర్లలోని దాడి బాధితులను పరామర్శించేందుకు రాజాసింగ్ చెంగిచెర్ల వెళతానని అన్నారు.
ప్రధాని మోడీని రేవంత్ పొగడడంపై స్పందించారు ఎమ్మెల్యే రాజా సింగ్. కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రధాని డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతిని బయటపెట్టాలని రిక్వెస్ట్ చేశారు.
తెలంగాణలో 9 మంది ఎంపీ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత మొదలైంది. తమ పేర్లను ప్రకటించలేదని కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ లిస్టులో సోయంబాబురావు, రఘునందన్ రావు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఉన్నారు.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కువైట్ లో ఉంటున్న చంద్రాయణగుట్టకు చెందిన మహమ్మద్ ఖాసిం ఇంటర్నెట్ కాల్స్ ద్వారా ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిపారు.