MLA Rajasingh : బీజేపీలో చేరుతున్నారా? జర జాగ్రత్త ..MLA రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరొక్కసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో చేరేవారు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలంటూ  ఆయన సూచించారు. పార్టీలోకి వచ్చాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరంటూ తేల్చి చెప్పారు.

New Update
rajasingh

MLA T. Rajasingh

MLA Rajasingh : తెలంగాణ బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరొక్కసారి సంచలన మీడియా ప్రకటన విడుదల చేశారు. బీజేపీలో చేరేవారు ఒక్కసారి ఆలోచించి పార్టీలో చేరాలంటూ  MLA రాజసింగ్ సూచించారు. ఒకసారి పార్టీలోకి వచ్చాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరు, మీకు టికెట్ గ్యారంటీ కూడా ఉండదంటూ చేరే నేతలకు రాజసింగ్ హెచ్చరిక చేశారు.బీజేపీలో వేరే పార్టీ నుంచి చాలామంది చేరుతారు అంటూ మంచి వార్త నడుస్తున్నది. బీజేపీలో చేరేవారికి స్వాగతం సుస్వాగతం. కానీ, బీజేపీలో చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోండి అలాగే రాసి కూడా పెట్టుకోండి.బీజేపీలో చేరిన తర్వాత, మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు అంటూ రాజాసింగ్‌ కౌంటర్‌ వేశారు.

Also Read: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు వానలే వానలు

మీ పైన విశ్వాసం పెట్టుకొని మీ కార్యకర్తలు బీజేపీలో చేరిన తర్వాత మీరు ఆ కార్యకర్తలకు ఏ పదవి కూడా ఇప్పించుకోలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తది అని గ్యారెంటీ కూడా ఉండదని తేల్చి చెప్పారు. బీజేపీలో ఈ రోజు మీరు చేరుతారు కదా ఫస్ట్ సీట్లో మీరు ఉంటారు కానీ తర్వాత లాస్ట్ సీట్లోఉంటారని ఎద్దేవా చేశారు, బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు మీరు చేసుకోవాలి. కొన్ని బాధలు కూడా భరించే శక్తి కూడా మీలో పెంచుకోవాలని సూచించారు.  అసెంబ్లీలో 11 సంవత్సరాలుగా అణచివేతను ఎదుర్కొంటున్నామన్నారు. మా జిల్లాలో వాళ్ల వ్యక్తి మా నియోజకవర్గంలో వాళ్ల వ్యక్తి మా డివిజన్ లో వాళ్ల వ్యక్తి మేము కోరుకున్నా, గోషామహల్ అసెంబ్లీ నుండి మమ్మల్ని మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం మేము ఏమీ చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీలో చేరేముందు బీజేపీలో  చేరిన తర్వాత ఏమైతది అని కొంతమందితో మీరు చర్చించి రావాలని రాజాసింగ్‌ సూచించారు. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ఇట్లాంటి చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో  చేరిన తర్వాత ఏమైంది?  చేరిన తర్వాత పార్టీ ఇడిసి ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళతోని ఒక్కసారి చర్చ చేసుకోండని నా పర్సనల్ సజెషన్ అంటూ రాజాసింగ్‌ కోరారు.

హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్న రాజాసింగ్‌  తెలంగాణలో మాత్రం బీజేపీ ని మా అబ్బపార్టీ అనుకునే వాళ్ళ వల్లనే పార్టీ సర్వనాశనం అయితుందని ఆరోపించారు. బీజేపీలో మేము ఏది చెప్తే అదే అయితది మేము ఏది రాస్తే అదే రాజ్యమైతది అనుకునే వ్యక్తుల వల్లనే పార్టీ సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్‌ ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్యకర్తల ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ తెలంగాణను పాలిస్తుంది.తెలంగాణలో ముఖ్యమంత్రి బీజేపీ నుండి వస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..

Advertisment
తాజా కథనాలు